Home

»

Tv News

Jayam serial Today Episode 405: గంగకు వార్నింగ్ ఇచ్చిన జయ.. ఓవర్ వెయిట్ తో గంగను డిస్ క్వాలిఫై చేసే ప్లాన్ లో శకుంతల!

Oct 22, 2026 9:51AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-405 లో.. పెద్దసారు చీటీలు వేస్తాడు. దాన్ని ప్రీతీ కొడుకుతో తీయిస్తాడు‌. అందులో గంగ పేరు ఉండటంతో తనే గెలుస్తుందని పెద్దసారు అంటాడు. ఇలాంటివి నేను నమ్మను మామయ్య.. ‌ఇవన్నీ జరగవని మరో చీటీ ఓపెన్ చేసి‌ చూస్తుంది జయ. అందులో కూడా జయ పేరు ఉంటుంది. అదేంటి మామయ్య ఇందులో కూడా గంగ పేరు ఉందని జయ అడుగుతుంది‌. ఆ తర్వాత వీరు ఓపెన్ చేసి చూస్తే దానిలో కూడా గంగ పేరు ఉంటుంది. ఏంటి మామయ్య ఇలా చేశారని జయ అడుగుతుంది. ఏంటి ఇలా చేశారని శకుంతల అడుగుతుంది. గంగని మోటివేట్ చేయడం కోసం నేనే ఇలా చీటీలు రాశానని రుద్ర అంటాడు.

నీ భార్యని మోటివేట్ చేయడం కోసం గంగని తక్కువ చేయడం కరెక్ట్ కాదని వీరు, ఇషిక, శకుంతల నానా మాటలు అంటారు. అయినా రుద్ర తన భార్యకి సపోర్ట్ ఇవ్వడం కోసం, తనని మోటివేట్ చేయడం కోసమే ఇలా చేసి ఉంటాడని ప్రీతీ అంటుంది. ఆ తర్వాత జయ వెళ్తుంటే తన కార్ దగ్గరికి గంగ వెళ్తుంది. ఏంటి గంగ.. అందరితో బాగా క్లోజ్ ఉండటం చూసి జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. ఎంత చేయాలో అంతా చెయ్ .. నేనేం చేయాలో నాకు తెలుసు.. జస్ట్ టైమ్ కోసం చూస్తున్నానని , కాన్ఫిడెన్స్ ఉండాలి.. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని గంగ అంటుంది. పాయసంలో విషం కలిపింది నువ్వే అని విశ్వ సర్ కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు.. అదే పెద్దసారకి తెలిస్తే ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేపిస్తారు‌ని జయకి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది గంగ. బాక్సింగ్ లో గెలవకపోతే అదే జరిగేలా ఉందని జయ అనుకుంటుంది. ఆ తర్వాత రుద్రతో పెద్దసారు మాట్లాడతాడు.

ఎందుకు రుద్ర తప్పు నీ మీద వేసుకున్నావని పెద్దసారు అడుగగా మీరు ఇంటిపెద్ద ..‌మిమ్మల్ని ఎవరు తక్కువగా అనకూడదు.. మీరు గంగని మోటివేట్ చేయడానికి చేశారని అర్థం అయింది..‌కానీ మిమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదంటూ రుద్ర అనగానే పెద్దసారు ఎమోషనల్ అయి హత్తుకుంటాడు. గంగని మనం ఎంత మోటివేట్ చేసినా తను ఈజీగా డైవర్ట్ అవుతుందని రుద్ర అంటుండగా అప్పుడే అక్కడికి గంగ వస్తుంది. పెద్దసారు మోటివేట్ చేస్తాడు. నీ నమ్మకం, ధైర్యం రుద్ర అని పెద్దసారు చెప్పగానే అవునని గంగ అంటుంది. ఆ తర్వాత శకుంతల, వీరు, ఇషిక,జయ గదిలో మాట్లాడుకుంటారు. బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను అత్తయ్య ఎలాగైనా గంగని ఓడించి , గెలుపుని ఇంటికి కట్నంగా తీసుకొస్తానని చెప్తుంది. ఆ గంగని మనం నమ్మలేం.. ఎందుకంటే తనకి సపోర్ట్ గా రుద్ర ఉన్నాడని వీరు అంటాడు. తను అసలు పోటీకి  రాకుండా చూడాలని శకుంతల అంటుంది.  స్టెరాయిడ్స్, డ్రగ్స్, ఓవర్ వెయిట్ ఉంటే గేమ్ నుండి డిస్ క్వాలిఫై చేస్తారని జయ అనగా ఓవర్ వెయిట్ చేయడం ఈజీనే అని శకుంతల అంటుంది.  ఆ తర్వాత జయ వెళ్లిపోతుంది. గేమ్ గెలిచేవరకే .. ఆ తర్వాత దీనిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని శకుంతల అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com