Home

»

Tv News

Jayam serial : వీరుకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన రుద్ర.. విశ్వ సీరియస్ లుక్!

Jul 10, 2026 10:51AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -316 లో.....రుద్ర బావపై ఆక్సిడెంట్ చేయించింది ఈ వీరు నే అని రంగా అందరికి చెప్తాడు. మా అన్నయ్య చంపాలి అనుకుంది మీరా అని వీరు కాలర్ పట్టుకొని ప్రీతీ అడుగుతుంది. అప్పుడే ఆగు ప్రీతి అని రుద్ర రౌడీని పట్టుకొని వస్తాడు. రంగా చెంప చెల్లుమనిపిస్తాడు రుద్ర. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత రౌడీ ఏదో చూసుకోకుండా చేసాడని చెప్పి రుద్ర కవర్ చేస్తాడు. ఈ విషయం ఇంతటితో వదిలెయ్యండి అని రుద్ర అందరికి చెప్తాడు.

ఆ తర్వాత రంగా బాధపడుతుంటే గంగ వస్తుంది. వాళ్ళు వాళ్ళు ఒకటి నేనే పరాయివాడిని అని గంగతో చెప్పుకుంటూ రంగా ఎమోషనల్ అవుతుంటే అప్పుడే రుద్ర వస్తాడు. నేను అలా చేశానని భాదపడుతున్నావా కానీ నేను చేసే ప్రతీపనిలో నీ హెల్ప్ తీసుకుంటున్నాను కదా అని రుద్ర అంటాడు. నువ్వు వచ్చినప్పటి నుండి నీతోనే కదా ఉంటున్నానని రుద్ర ఎమోషనల్ గా మాట్లాడుతుంటే  రంగా కూల్ అవుతాడు. గంగ మాత్రం.. అన్నయ్య మనం స్ట్రైక్ చేద్దామని అంటుంది. రంగా నీ కోపం పోవాలి అంటే ఐస్ క్రీమ్ తినివద్దామని రుద్ర అనగానే గంగ నేను వస్తానని అంటుంది. వద్దని డైట్ చేయమని చెప్పి రుద్ర వెళ్ళిపోతాడు. కాసేపటికి వీరు దగ్గరికి రుద్ర వస్తాడు. ఎవరు బావ నీ మీద ఎటాక్ చేయించిందని ఏం తెలియనట్లు మాట్లాడతాడు వీరు. నాకు ప్రీతీ బాగుండడం కావాలి.. తనకి ఏ టెన్షన్ ఉండొద్దని నిన్ను వదిలేశానని రుద్ర ఇండైరెక్ట్ గా వీరుకి వార్నింగ్ ఇస్తాడు.

మరొకవైపు సుధా కిచెన్ లో వర్క్ చేస్తూ చెయ్ కట్ చేసుకుంటుంది. అది విశ్వ చూసి వెంటనే తన దగ్గరికి వెళ్తాడు. సోఫాలో జయ పాటలు వింటూ ఉంటుంది. నువ్వు జయకి అన్ని పనులు నేర్పించమని విశ్వ చెప్తాడు. దాంతో జయకి లక్ష్మి పనులు చెప్తుంది. జయ కోపంగా ఉంటుంది. విశ్వ ఏమైనా అంటాడేమో అని బలవంతంగా అన్నీ నేర్చుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com