Home

»

Tv News

Jayam serial : గంగ, రంగా హైడ్రామా.. బిజినెస్ డీలింగ్ వేళ వీరు బండారం బయటపడేనా?

Jul 1, 2026 10:26AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-308 లో......ఫారెనర్స్ తో డీలింగ్ కుదుర్చుకోవడానికి వీరుతో కలిసి ఇషిక ప్లాన్ చేస్తుంది‌. అందులో భాగంగా ఫారెనర్స్ ని భోజనానికి పిలుస్తుంది ఇషిక. పారెనర్స్ గా మనం రావాలంటే ముందు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలని రంగా, గంగ అనుకుంటారు. మరొకవైపు జయ గదిలో ఫోన్ మాట్లాడుతుంది. ఇన్నిరోజులు మనకి దూరంగా ఉంది.. అయినా మనతో టైమ్ స్పెండ్ చెయ్యడం లేదు.. ఇప్పటికి తను మన కూతురేనా అన్న డౌట్ ఉందని సుధాతో విశ్వ అంటాడు. ఆ మాట మళ్ళీ అనకండి.. మళ్ళీ ఏదైనా చేసుకుంటుంది.. అసలే మొండిది మీలాగే అని సుధా అంటుంది.

నాలాగా కాదు.. నేను ఏదైనా అంటే సమాధానం చెప్తాను.. అలా పిరికిదానిలాగా కాదని విశ్వ అంటాడు. గంగని చూడు తనని నేను ఎంత డిస్కరేజ్ చేసిన తను మాత్రం నాకు తన గెలుపుతో సమాధానం చెప్పింది. నా కూతురు అంటే గంగలాగా ఉండాలని విశ్వ అంటాడు. ఆ మాటలు పైడిరాజు, లక్ష్మి విని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత జయ మాట్లాడేది ఎవరితోనో.. తన కాల్ రికార్డింగ్ మొత్తం నాకు కావాలి... తను ఎక్కడికి వెళ్తుంది.. ఎవరిని కలుస్తుంది.. ప్రతీ ఒక్క డీటేయిల్ నాకు కావాలని పైడిరాజుతో విశ్వ అనగానే సరే సర్ అని పైడిరాజు అంటాడు.  మరొకవైపు రంగా, గంగ ఫారెనర్స్  గెటప్ లో ఎంట్రీ ఇస్తారు.  మొరాకోగా గంగ, పంప్ లాగా రంగా వస్తారు. ఇక వాళ్ళిద్దరిని  ఇషిక దగ్గరుండి లోపలికి ఆహ్వానిస్తుంది. రుద్రని చూసి  ఈ గ్రేకువీరుడు ఎవరని మొరాకో అడుగుతుంది. ఏంటే చెల్లి.. బావ జోలికి వెళ్తాన్నావని రంగా మెల్లగా అడుగుతాడు. అతను మా బావగారు తనకి పెళ్లి అయిందని ఇషిక చెప్తుంది. దాంతో డిసప్పాయింట్ గా మొరకో మాట్లాడుతుంటే.. పాపం రుద్ర బావ మీద మనసు పడేసుకున్నట్లుందని ఇషిక అనుకుంటుంది. సెకెండ్ మ్యారేజ్ అయినా నాకూ ఒకే అని మొరాకో అంటుంది. అప్పుడు నా కోడలు గంగ ఒప్పకోదని పెద్దసారు అంటాడు. ఇదేంటీ ఎక్స్ ట్రాలు చేస్తుందని రుద్ర అనుకుంటాడు.

ఆ తర్వాత మమ్మల్ని ఎందుకు పిలిచారని పంప్ అడుగుతాడు. మీతో బిజినెస్ డీలింగ్ కోసం పిలిచామని ఇషిక అంటుంది. ఆల్రెడీ వీరు ఒక కంపెనీ తీసుకొని వచ్చాడు కదా అని కంపెనీ పేరు చెప్తాడు. అంటే సూర్య వాళ్లని మోసం చేసిన వాళ్లకి ఇంత పెద్ద డిలింగ్ కీ హెల్ప్ చేసావా.. అందుకేనా వాళ్ళు కాంట్రాక్ట్ క్యాన్సిల్ కి వచ్చారా అని శకుంతల అడుగుతుంది. అవన్నీ తర్వాత మాట్లాడుదాం అత్తయ్య.. ప్లీజ్ ముందు భోజనం చేద్దామని వీరు అంటాడు. మరొకవైపు వీరు బిజినెస్ పార్టనర్స్ కి రుద్ర ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com