Home

»

Tv News

Jayam serial : ఇషిక మైండ్ గేమ్.. వీరు ప్లాన్స్ కి రుద్ర, గంగ మాస్టర్ స్కెచ్!

Jun 30, 2026 9:38AM

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -307 లో..... అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే తప్ప ఫారెనర్స్ తో కాంట్రాక్ట్ కుదరదని వీరు తన బిజినెస్ పార్టనర్స్ ని ఇంటికి రప్పిస్తాడు. తనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి రప్పించానని అందరి ముందు చెప్పుకుంటాడు వీరు. ఆ తర్వాత ఇషిక ముందు కావాలనే గంగ, రంగా ఒక ఐడియా ఇస్తారు. అగ్రిమెంట్ క్యాన్సిల్ పై సంతకం పెట్టమని వాళ్ళు అంటారు. అగ్రిమెంట్ పై సంతకం పెట్టాలంటే మేమ్ ఇన్వెస్ట్ మెంట్ చేసిన అమౌంట్ మాకు ఇవ్వాలని ఇషిక కండిషన్ పెడుతుంది.

ఎందుకు ఇషిక ఇప్పుడు అవన్నీ మన కుటుంబం పరువుపోకుంటే చాలు డబ్బు ఎందుకని శకుంతల అంటుంది. అయిన ఇషిక వినదు. దాంతో వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకుంటారు. అప్పుడే వీరుకి ఫారెనర్స్ గా యాక్టింగ్ చేస్తున్న రంగా, రంగా ఫోన్ చేసి మన కాంట్రాక్ట్ కి ఇంకొక గంట మాత్రమే ఉందని చెప్తారు. దాంతో వీరు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ తో పాటు మేం ఈ కాంట్రాక్ట్ డీలింగ్ కుదర్చుకొని వేరే కాంట్రాక్ట్ మిస్ అయ్యాం.. అందుకు ఆ నష్టం కూడా ఇవ్వాలని ఇషిక అనగానే నీకు ఏమైనా మెంటలా.. వాళ్ళు ఏదో సాయంగా ఇస్తానంటే ఆశకి కూడా హద్దు ఉండాలని ఇషిక మీద వీరు కోప్పడతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. మాకు సపోర్ట్ గా మాట్లాడాలి కానీ వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నావేంటని వీరుతో ని ఇషిక అంటుంది. ఏది ఏమైనా మేము అడిగిన డబ్బులు ఇస్తేనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తామని ఇషిక అంటుంది. ఆ తర్వాత ఇషిక, సూర్య దగ్గరికి వీరు వెళ్లి ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయితే వాళ్ళకి ఫారెనర్ కాంట్రాక్ట్ వస్తుంది. అందుకే ఇలా అని వీరు అంటాడు.

నువ్వు ఆ కాంట్రాక్ట్ మాకు చెప్పకుండా వాళ్ళకి చెప్తున్నావ్ ఏంటి బ్రో.. ముందు వాళ్ళని భోజనానికి పిలువు వాళ్ళని మన సైడ్ కి తిప్పుకుందామని ఇషిక అంటుంది. వేరే దారి లేక వాళ్ళకి వీరు ఫోన్ చేస్తాడు. ఇషిక మాట్లాడుతూ వాళ్ళని భోజనానికి పిలుస్తుంది. వాళ్ళు సరే అంటారు. రుద్ర, గంగ, రంగ ముగ్గురు మాట్లాడుకుంటారు.  మీరు రేపు బాగా యాక్టింగ్ చెయ్యాలి.. కాబట్టి మరింత జాగ్రత్త అని రంగా, గంగలకి రుద్ర చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ కళ్లలో ఏదో పడితే ప్రమీల ఏమైందని ఎక్కవ ఆసక్తి చూపిస్తుంటే మక్కమ్ ఆశ్చర్యంగా చూస్తాడు. అదేంటే బ్రో మేడమ్ అలా చేస్తుందని కార్తీక్ ని మక్కమ్ అడుగుతాడు. మేడం జాగ్రత్తగా ఉండమని చెప్తుంది అంతే అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com