
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -234 లో... పెద్దసారుతో రుద్ర మాట్లాడతాడు. ప్రమాదం ఉందని నువ్వు ముందే ఊహించావ్ కదా.. నిన్ను నేను గమనించాను.. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని పెద్దసారు అనగానే ఇదంతా బిజినెస్ పరంగా చేస్తున్నారని రుద్ర అంటాడు. నాకు తెలుసు రుద్ర నువ్వు ఈ కుటుంబానికి ఏం కాకుండా కాపాడుతావు కానీ నీకు ఏదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేని అని పెద్దసారు ఎమోషనల్ అవుతాడు. అదంతా వీరు వింటాడు. రుద్ర వచ్చి ఏంటి వీరు ఇక్కడున్నావని అడుగుతాడు.
మావయ్యతో మాట్లాడుదామని అనుకున్నాను.. మీరు మాట్లాడుతున్నారు కదా అందుకే ఇక్కడే ఉన్నా అని వీరు అంటాడు. నువ్వు కూడా ఈ కుటుంబం కదా పర్సనల్ ఏముంటుందని రుద్ర అంటాడు. వీరు నువ్వు కూడా జాగ్రత్త ఎవరైనా దెబ్బలు బయటకు కన్పించకుండా కొడతారు. ఆ దెబ్బలు నువ్వు మళ్ళీ మాకు ఎవరికి చెప్పలేక బాధపాడుతావ్.. ఎందుకు ఈ కుటుంబంలో వ్యక్తివే కదా.. అందుకే నీపై కూడా ఎటాక్ జరగొచ్చని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఉదయం ఇక ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్ళదని వీరు అనుకుంటాడు. అప్పుడే ప్రమీల రెడీ అయి హడావిడిగా కిందకి వచ్చి గంగ బాక్స్ రెడీ చేసావా అని అడుగుతుంది. నువ్వు వెళ్ళావని అనుకున్న అక్క అని గంగ అనగానే అత్తయ్య ఏదో అన్నారని ఇంట్లో కూర్చుంటే ఎలా అని ప్రమీల అంటుంది.
గుడ్ ప్రమీల ఇలానే ఉండాలని రుద్ర తనకి సపోర్ట్ చేస్తాడు. ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్తుంటే శకుంతల కోపంగా చూస్తుంది. వీరు డిస్సపాయింట్ అయ్యావా అని రుద్ర అంటాడు. ఆ తర్వాత పెద్దసారుని చూడడానికి లక్ష్మి, పైడిరాజు వస్తారు. చూసారా అత్తయ్య మీరు ఈ ఇంటికి రావద్దన్నా కూడావచ్చారని శకుంతలతో ఇషిక అంటుంది దాంతో వాళ్ళని శకుంతల అవమానించి పంపిస్తుంది. గంగ బాధపడుతుంది. తరువాయి భాగంలో గంగ పేరెంట్స్ ని మీరే కనుక్కోవాలి బాబు అని ఏం జరిగిందో అంత రుద్ర, రంగాకి లక్ష్మీ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
