Home

»

Tv News

Ye Devi Varamo Neevu : ఆశ్రమం కోసం అంజలి పోరాటం.. జానకమ్మకు క్యాన్సర్!

Jul 11, 2026 10:40AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -05 లో.....మా మేనత్త ఏం అనుకుంటే అది జరగాలి.. మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి. ఈ మెషిన్స్ మనీష్ అంత మంచివి కావని అందరికి వార్నింగ్ ఇస్తాడు  మనీష్. మరొకవైపు గీత ఇని స్టిట్యూట్ కి సంబంధించిన భూమి పూజకి ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడికి గీతంజలి వస్తుంది. అక్కడ మనీష్ ని చూసి నువ్వు ఏంట్రా ఇక్కడ అని అడుగుతుంది.

మనీష్ తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్ ఉంటే వచ్చాను. ఇప్పుడు క్లియర్ అయింది. మా అత్త ఏది అనుకుంటే అది జరగాల్సిందే అని మనీష్ అంటాడు. మరొకవైపు ఆశ్రమం కూల్చేస్తుంటే అందరు బాధపడుతారు. ఎలాగైనా ఆపాలని భూమి పూజ చేస్తున్న గీతాంజలి దగ్గరికి అంజలి వచ్చి గొడవ చేస్తుంది. మీకు ముందే చెప్పాము కదా అని గీతాంజలి అంటుంది. లేదు ముందే రౌడీలని పంపించారని అంజలి చెప్తుంది. అక్కడ మీడియా వాళ్ళు ఉంటారు. అనాధాశ్రమం భూమిని బలవంతంగా లాక్కున్నారని మీడియా వాళ్ళు అంటుంటే అది ఆపమని చెప్పమని అంజలిని గీతాంజలి బెదిరిస్తుంది. నేను చెప్పానని అంజలి అంటుంది. వాళ్ళతో గొడవ వద్దని జానకమ్మ అంటూ కిందపడుతుంది. గీతాంజలి వెళ్ళిపోతుంది. జానకమ్మని అంజలి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అక్కడ డాక్టర్ జానకమ్మకి టెస్ట్ చేసి క్యాన్సర్ ఉంది. ఎక్కువ రోజులు బ్రతకదని చెప్తారు. దాంతో అంజలి ఏడుస్తుంది. మరొకవైపు గీతాంజలి ఒక దగ్గర ఆగి ఇన్నిరోజుల్లో ఎప్పుడు ఇలా అవ్వలేదు.

అందుకే నేను ఏ మోసం చెయ్యలేదని అనుకోవాలంటే నేను అక్కడే ఇనిస్టిట్యూట్ కట్టాలని మనీష్ తో గీతాంజలి అంటుంది. మరొకవైపు జానకమ్మని హాస్పిటల్ నుంచి అంజలి ఇంటికి తీసుకొని వస్తుంది. తరువాయి భాగంలో మనం ఈ అనాధాశ్రమం వదిలి వెళ్తున్నాం అంతే అని జానకమ్మ తన నిర్ణయం చెప్తుంది. ఆ తర్వాత అంజలికి తన అమ్మ ఎలా తెలుస్తుందని బాధపడుతుంది మరొకవైపు జానకమ్మకి గతంలో అంజలిని అనాధాశ్రమంలో వదిలేసినప్పుడు ఇచ్చిన చెక్ చూసి ఈ చెక్ ద్వారా అయినా అంజలికి తన వాళ్ళు తెలిసే ఛాన్స్ ఉందని జానకమ్మ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com