Home

»

Tv News

అమెరికా - ఇరాన్ యుద్ధంపై జబర్దస్త్ కమెడియన్స్ పంచ్‌లు!

May 27, 2026 12:28PM

అమెరికా - ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ జబర్దస్త్ కమెడియన్స్ మీద కూడా పడింది. దాంతో జబర్దస్త్ అల్లాడిపోతోంది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో స్కిట్ లో ఒక్కో అద్భుతమైన డైలాగ్ ఉంది. ధనరాజ్ స్కిట్ చూస్తే ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. "నాకు పెళ్లి కావడం లేదు. నాకేమో వయసు దాటిపోతోంది. నా జాతకం చూసి ఎప్పుడు పెళ్లవుతుందో చెప్పరా " అని బస్మానంద గురూజీని అడిగాడు. "1000 మందికి ఉంటుంది ఇలాంటి జాతకం " అన్నాడు బాబా. "అంత చక్కగా ఉందా " అన్నాడు. "లేదు అంత చెత్తగా ఉంది జాతకం" అన్నాడు బాబా.  "కుజుడు నీతో కోకో, కబడ్డీ ఆడిస్తున్నాడు నాయన" అన్నాడు బాబా. "మొన్న ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద మిసైల్ వేశారు కదా.

అలా వేసినప్పుడు అదిగో కుడి వైపున ఉన్న కుజుడు ఎడమవైపుకు మారిపోయాడు. ఈ ట్రంప్ గాడు ప్రపంచం మొత్తం కంపు చేస్తున్నాడనుకున్నాను కానీ నా జీవితాన్ని కంపు చేస్తున్నాడని అనుకోలేదురా " అంటూ ధనరాజ్ తెగ ఫీలైపోయాడు. ఇక రాంప్రసాద్ స్కిట్ లో దొరబాబు డాక్టర్ గెటప్ లో వచ్చాడు. అలాంటి ఇలాంటి డాక్టర్ కాదు. డాక్టర్ కొమరం శృంగార నిపుణుడిగా వచ్చాడు. ఇక చివరిలో రోహిణి - తాగుబోతు రమేష్ అండర్ వేర్ స్కిట్ మాములుగా లేదు. తాగుబోతు రమేష్ అండర్ వెర్స్ తెచ్చేసరికి రోహిణి ఫీలైపోయింది.

"కనపడని వాటి గురించి ఖర్చు పెట్టొద్దని ఎన్ని సార్లు చెప్పాను. డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు  " అంటూ సతాయించింది. ఐతే ఆ అండర్ వేర్ లో 24 చిరుగులు ఉన్నాయని తాగుబోతు రమేష్ చెప్పేసరికి   24 బొక్కలు పడ్డాకా చిరిగిపోయింది అంటారు. వెలాస్టిక్  ఒక్కటే మిగిలిఉంటది కదా అంటూ నాగబాబు, ఇంద్రజ పగలబడి నవ్వారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com