
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 589 లో.....ధీరజ్, ప్రేమల పెళ్లి అయి ఇంటికి వచ్చిన మరుక్షణమే పుట్టింటికి దారేది అంటూ నువ్వు పరుగెత్తడమే అని నర్మద వల్లీకి గట్టి వార్నింగ్ ఇస్తుంది. శాంతమ్మ ప్రేమని బయటకు తీసుకొచ్చి చూడవే నీ భర్తకి మంగళస్నానాలు ఎలా చేయిస్తున్నారో.. ఇప్పుడు నీకు కూడా మంగళస్నానాలు చేసి ఊరేగింపుగా తీసుకెళ్లాలే కానీ నీ మూర్ఖత్వంతో అన్నీ పోగొట్టుకుంటున్నావని బామ్మ అంటుంది.
ఇంతలో విశ్వ మేడ మీద నుంచి ప్రేమ మీద నీళ్లు చల్లి సందడి చేస్తాడు. వియ్యాల వాళ్లకి మనం ఏం తక్కువ కాదమ్మా అంటూ ప్రేమని తడిపేస్తాడు. దీన్ని చూసిన నర్మద, రామరాజు వాళ్లతో అక్కడ ప్రేమకి కూడా మంగళస్నానం అవుతుంది చూడండి అని అందరికి చూపిస్తుంది. ధీరజ్ వాళ్లు సందడి సందడి చేస్తారు. అయితే అసలు కుట్ర వెనుక వల్లీనే ఉందని స్మిత నర్మదకు కాల్ చేసి చెప్తుంది. ప్రేమ, ధీరజ్ లను విడదీయాలని వల్లీనే ప్లాన్ చేసింది.. అన్నింటికీ సూత్రధారి తనే, భద్రావతిని వాడుకుంది.. ఫేక్ ఎస్ఐ గురించి, మోపిదేవిలో జరిగిన పెళ్లి వీడియోలు మొత్తం తీసుకున్నారంటూ డిటైల్స్ పంపిస్తున్నా చూడమని స్మిత అనడంతో నర్మద షాక్ అవుతుంది.
ఆగిపోయే పెళ్లికి సందడి ఎక్కువ అంటూ వల్లీ డ్యాన్సులు వేస్తూ ఉంటే నర్మద పట్టరాని కోపంతో వెళ్లి వల్లీ ముఖాన్ని నీటిలో ముంచేస్తుంది. ప్రేమ, ధీరజ్ లను విడదీయడానికి ఇంత కుట్ర చేస్తావా అని నిలదీస్తుంది. మీ అమ్మానాన్నల్ని మోపిదేవికి ఎందుకు పంపావని నీటిలో ముంచుతూనే ప్రశ్నిస్తుంది. వాళ్ల పెళ్లి గురించి తప్పుగా అనుకుంటే నిజం తెలుసుకోవాలని పంపాను కానీ కాపురం కూలిపోవాలని అనుకోలేదని వల్లీ బ్రతిమాలుతుంది. చచ్చిపోయేలా ఉన్నాను వదిలేయ్ చెల్లాయ్ అని వల్లీ అనడంతో నర్మద వదిలేసి, ధీరజ్, ప్రేమల పెళ్లి అయ్యేంత వరకు నిన్ను వదిలేస్తున్నా.. తర్వాత ఆధారాలతో సహా నీ కుట్రను మామయ్య ముందు పెడతా అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
మరోవైపు ధీరజ్ ని పెళ్లి కొడుకులా రెడీ చేస్తారు. ప్రేమ కూడా పెళ్లి కూతురిలా రెడీ అవుతుంది. ధీరజ్ బయటకు వచ్చి ప్రేమ అని పిలవడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుని హగ్ చేసుకుంటారు. తీరా చూస్తే అదంతా ప్రేమ ఊహ. నేను పెళ్లికి వెళ్లనని ప్రేమ అంటే బామ్మ తిడుతుంది. భద్రావతి వచ్చి ప్రేమని ఇబ్బంది పెట్టొద్దంటూ చీర పక్కన పడేసి.. పెళ్లి టైం అయ్యేవరకు ప్రేమని చింతామణి ఇంట్లో ఉంచుతానని తీసుకెళ్లిపోతుంది. ఇక నర్మద వాళ్లంతా ధీరజ్ దగ్గరకు వెళ్లి అందరు బయల్దేరిపోయారు. పెళ్లి మండపానికి వెళ్దాం అని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Illu Illalu Pillalu, Illu Illalu Pillalu Episode 589, Star Maa Serial, Dheeraj, Prema, Narmada, Valli, Bhadravathi, Ramraju, Smita, Wedding, Chintamani]






