Home

»

Tv News

Illu illalu pillalu:  బావ చేతిలో దెబ్బతిన్న శ్రీవల్లి.. అసలు నిజం తెలిశాక చందు ఏం చేశాడు?

Apr 01, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-433 లో.. శ్రీవల్లి ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి టీచర్ జాబ్ చేస్తున్నట్టు అందరిని మోసం చేసిందని చందు తెలుసుకొని తన చెంప చెల్లుమనిపిస్తాడు. నిన్ను మా నాన్న ఎంతో నమ్మాడు కదే.. ఇన్ని అబద్ధాలు చెప్తారా..‌ఇంత మోసం చేస్తారా.. అయిన తనకి కాబోయే కోడలు చదువుకోవాలని మా నాన్న ఏం అడుగలేదు కదా.. నీ బ్రతుకే అబద్ధం అని చందు తిడతాడు. అయ్యో బావ.. అదేం కాదు.. నేను చెప్పేది విను బావ.. నిన్ను పెళ్ళి చేసుకోడానికే అలా చెప్పాను కానీ నిన్ను మోసం చేయాలని కాదు బావ అని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంటే తనని అక్కడే వదిలేసి బైక్ పై వెళ్ళిపోతాడు. ఇక శ్రీవల్లి ఏడుస్తూ ఇంటికి వస్తుంటే భాగ్యం కాల్ చేస్తుంది. ఏమైంది అమ్మడు అని అనగానే తనపై కోప్పడుతుంది శ్రీవల్లి. నువ్వు ఇంటికి వెళ్లు.. మేం అక్కడికి వస్తున్నామని భాగ్యం అంటుంది. మరోవైపు శ్రీవల్లి కోసం నర్మద, ప్రేమ ఎదురుచూస్తుంటారు. అప్పుడే చందు ఫుల్ కోపంగా రావడం చూసి..వల్లికి గట్టిగనే అయినట్టుందని అనుకుంటారు. కాసేపటికి వల్లి ఏడ్చుకుంటూ చెంపకి చేతిని అడ్డుగా పెట్టుకొని వస్తుంది.‌ ఇక నర్మద, ప్రేమ వెళ్ళి ఏంటి అక్కా అలా ఉన్నావని అడుగుతారు. చేసిందంతా చేసి ఏ‌ తెలియనట్లు మళ్ళీ పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడుతున్నారని కోపంగా వెళ్ళిపోతుంది. 

ఆ తర్వాత భాగ్యం  , ఆనందరావు వస్తారు. ఏంటి బాబాయ్ ఈ టైమ్ లో వచ్చారని నర్మద, ప్రేమ అడుగుతారు. ఏం అయిందని ముహూర్తం బాలేదా అని భాగ్యం అడుగగా.. మీకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది.. మామయ్య గారు మీ మీద ఫుల్ కోపంగా ఉన్నాడని నర్మద, ప్రేమ చెప్తారు. అదే సమయంలో రామరాజు గునపం తీసుకొని వస్తాడు. అది చూసి భాగ్యం, అనందరావులని నర్మద, ప్రేమ భయపెడతారు. వెళ్ళి కాళ్ళ మీద పడండి.‌ క్షమిస్తాడని నర్మద, ప్రేమ అనగానే భాగ్యం, ఆనందరావు ఇద్దరు వెళ్ళి రామరాజు కాళ్ళ మీద పడతారు‌. మమ్మల్ని క్షమించమని అడుగుతారు. ఎందుకని రామరాజు అనగానే మీరు వృద్ధాశ్రమం కోసం పదిలక్షలు ఇచ్చారు కదా.. నష్టపోయామని భాగ్యం కవర్ చేస్తుంది. ఆ తర్వాత రామరాజు వెళ్ళిపోతాడు. ఏంటి అమ్మడు అంతా లీక్ అయిందని చెప్పావని భాగ్యం అడుగుతుంది. మీరు ఇంకొకసారి ఇంటికవచ్చినా.. ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నా మీ బంఢారం బయటపడిపోద్దని నర్మద అనగానే ఆశ, దోశ, అప్పడం వడ మీకు ఆ ఛాన్స్ ఇస్తామా అని ఆనందరావు అంటాడు. భాగ్యం, ఆనందరావు ఇద్దరు పారిపోతారు. ఆ తర్వాత శ్రీవల్లి దగ్గరికి నర్మద, ప్రేమ వెళ్తారు. రేపు ఉదయం నీకు అసలు సినిమా ఉందని శ్రీవల్లితో నర్మద, ప్రేమ చెప్పి వెళ్తారు. అయ్యో దేవుడా.. వీళ్ళు మళ్ళీ ఏం పెంట చేశారో ఏమో అని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మరోవైపు రామారాజు కొబ్బరి కాయలు పొట్టుతీస్తుంటాడు. కాసేపటికి వేదవతి మజ్జిగ తీసుకొని వచ్చి రామరాజుకి ఇస్తుంది. తను కూడా కొబ్బరి కాయలు పొట్టు తీస్తానని వేదవతి అడుగగా ఇద్దరు కలిసి తీస్తారు. ఆ తర్వాత ధీరజ్ వస్తాడు.. ముగ్గురం ఉన్నాం.‌.‌ఇంకా నువ్వు ఇలా కష్టపడాలా.. నేను చేస్తాను మీరు వెళ్ళండి నాన్న అని రామారాజుని ధీరజ్ ఇంట్లోకి పంపిస్తాడు. ఆ తర్వాత ధీరజ్ కోసం ప్రేమ కాఫీ తీసుకొని వస్తుంది. తను వద్దని అంటాడు. రేయ్ చిన్నోడా నేనే నీ కోసం చేశానురా.. తనతో ఇచ్చి పంపించా అని వేదవతి అనగానే.. మా అమ్మ నా కోసం ప్రేమతో చేసింది కాబట్టి తాగుతున్నానని తాగుతాడు ధీరజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com