
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -138 లో.... జాను దగ్గరకు గౌతమి వెళ్లి సంతోషంగా హగ్ చేసుకుంటే, ఆపు అక్క నీ నటన అంటూ గౌతమి ఫైర్ అవుతుంది. మనం నలుగురు అక్కాచెల్లెళ్లు కలిసి ఉంటామని గర్వపడ్డాను కానీ మీ ఇద్దరూ మీ దారి మీరు చూసుకున్నారని నిలదీస్తుంది. నాన్న తర్వాత నాన్నలా చూసుకుంటానని చెప్పి మంచి ధనవంతుడైన సంజయ్ గారిని చూసుకున్నావ్, పెద్దక్క జాబ్ చూసుకుంది.. మరి నా బతుకేంటని ప్రశ్నిస్తుంది. అక్క జాబ్ చేస్తుంది ఎక్కడ, జీతం ఎంత అని జాను అడిగితే, నాకు తెలిసినా ఉపయోగం ఏంటి.. నా చదువు ఏం కావాలని గౌతమి ఏడుస్తుంది. కాలేజీలో చదివిస్తా అన్నావ్. ఈ ఇంట్లో జల్సాగా బతుకుతున్నావంటూ జానుపై గౌతన ఆవేదన వ్యక్తం చేస్తుంది. అప్పుడే నందు వస్తుంది. తను కూడా జానూపై కోప్పడుతుంది. సింహాద్రి ఇచ్చిన డబ్బు లెక్క చెప్పు అక్క అంటూ గౌతమి జానుని లెక్కలు అడుగుతుంది.
మరొకవైపు మురళి తను జాబ్ లో జాయిన్ అయ్యేకంటే ముందు ఒక యాభై వేలు అడ్వాన్స్ కావాలని మేనేజర్ ని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో అతను ఇస్తానని అంటాడు. ఆ డబ్బు తీసుకొని వెళ్లి నందు జాబ్ కోసం ఇవ్వాలనుకుంటాడు. మరొకవైపు నందుని తన మేనేజర్ పిలిచి యాభై వేలు కట్టమన్న కదా అని అడుగుతాడు. కడతానని నందు చెప్తుంది.
మరొకవైపు బామ్మ, తాతయ్య ఇద్దరు కలిసి డ్రామా చేసి సంజయ్ ని రిసెప్షన్ కి ఒప్పిస్తారు. ఎల్లుండే రిసెప్షన్ అని ఫిక్స్ చేయడంతో ఇంట్లో హడావిడి మొదలవుతుంది. జాను, సంజయ్ మధ్య ఇంకా గ్యాప్ ఉన్నా, పెద్దవాళ్లు వాళ్ళు చెప్పేది వినకుండా రిసెప్షన్ కి ఏర్పాట్లు చేస్తారు. దాంతో జానూ, సంజు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
