.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-144లో.. జాను, సంజయ్ రిసెప్షన్ మొదలవుతుంది. జాను, సంజయ్ రిసెప్షన్ కి రెడీ అయి రాగానే బామ్మ, తాతయ్య ఇద్దరిని చూసి మురిసిపోతారు. సంజయ్ ఫ్యామిలీ మొత్తం స్టేజ్ మీదకి వెళ్లి ఫొటోలు తీసుకుంటారు. జాను, సంజయ్ లను క్లోజ్ గా ఉండమని మరిన్ని ఫొటోలు తీస్తారు. తర్వాత ఇద్దరూ దండలు మార్చుకుని, రింగులు పెట్టుకుంటారు. అంతా బాగుంది అనుకునే టైమ్ లోనే అక్కడికి సూర్య వస్తాడు.సూర్యని చూడగానే జాను షాక్ అవుతుంది. సూర్య వచ్చాడేంటి.. ఎందుకు వచ్చాడు.. దేవుడా ఏంటి ఇది అని మనసులో అనుకుంటూ జాను భయంగా టెన్షన్ గా ఉంటుంది. జాను డల్ గా ఉండటం చూసిన సంజయ్ ఏమైందని అడిగితే ఏం లేదని కవర్ చేస్తుంది. అదే టైమ్ లో రమణి కూడా జాను డల్ గా ఉండటం చూసి రెస్ట్ రూమ్ కి వెళ్తావా వెళ్లు అంటూ పక్కకి తీసుకెళ్తుంది.
అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది. జాను చాటుగా వెళ్లి సూర్యని కలిసి ఎందుకు వచ్చావని అడుగుతుంది. దానికి సూర్య ఎందుకు రాకూడదు జాను.. నువ్వు నా ప్రేమవి నా ప్రాణానివి అంటూ ఎమోషనల్ అవుతాడు. దానికి జాను నేను ఇప్పుడు సంజయ్ భార్యని సూర్య.. పెళ్లి అయిన అమ్మాయి వెంట పడటం కరెక్ట్ కాదు.. అన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్లవని తెగేసి చెప్తుంది. ప్రేమిస్తే ఇలా మోసం చేయడం కరెక్టేనా జాను, గోదారమ్మాయి మోసం చేయదనుకున్నా కానీ నువ్వు నన్ను మోసం చేశావ్.. నీతో మాట్లాడుతుంటే ఇంకొకరి భార్యతో మాట్లాడినట్టు అనిపించడం లేదు.. నీ పెళ్లిని నా మనసు ఒప్పుకోవడం లేదంటూ సూర్య బాధపడతాడు. వెళ్లిపో సూర్య అని జాను అంటే వెళ్లిపోతా కానీ ఒక్క మాట చెప్పు నిజంగా ఈ పెళ్లితో సంతోషంగా ఉన్నావా.. సంజయ్ కూడా సంతోషంగా కనిపించడం లేదు.. మీ ఇద్దరికి ఎన్ని రోజుల పరిచయం అని పెళ్లి వరకు వెళ్లిపోవడానికి.. నీ చిరునవ్వులో జీవం పోయింది, ముఖంలో కల లేదు.. నీకు అబద్ధం బలంగా చెప్పడం చేతకాదు.. ఎందుకు ముక్కూ మొహం తెలీని వ్యక్తిని పెళ్లి చేసుకున్నావ్.. నేనే కాదు నువ్వు కూడా బాధపడుతున్నావంటూ సూర్య నిలదీస్తాడు. దీంతో జాను నిజంగా నన్ను ప్రేమిస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోమంటూ సూర్యని పంపేస్తుంది.
మరోవైపు రిసెప్షన్ లో జాను ఫ్యామిలీ ఎంట్రీ కూడా ఎమోషనల్ గా సాగింది. మురళీ, శారద వాళ్లు జాను రిసెప్షన్ కి వస్తారు. బయట జాను, మురళీల ఫొటోలు చూసి గౌతమి, బామ్మ, కిన్నెర, మురళీ ఫొటోలు తీసుకుంటారు. అప్పుడే మురళీకి నందు ఫోన్ చేసి అమ్మతో మాట్లాడాలంటే బయట ఉన్నా తర్వాత ఫోన్ చేస్తానని మురళి కవర్ చేస్తాడు. లోపలికి వెళ్లగానే బామ్మ, తాతయ్య, రమణి, సంజయ్ రిసీవ్ చేసుకుంటారు. వచ్చినందుకు థ్యాంక్స్ బామ్మ అని సంజయ్ అంటాడు. శారదని కూడా అత్తయ్యా అని పిలిచి కూర్చోమని చెప్తాడు. ఇంతలో జాను వచ్చి తల్లిని చూసి సంతోషంగా పరుగున వచ్చి శారద చేతులు పట్టుకుని ఏడుస్తుంది. కానీ శారద మాత్రం మాట్లాడకుండా చేతులు వెనక్కి తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
