Home

»

Tv News

పట్టాలెక్కిన డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఎప్పటినుంచి అంటే!

May 18, 2026

జీ తెలుగులో డ్రామా జూనియర్స్ ఎంత పాపులర్ షోనో అందరికీ తెలుసు. చిన్నారుల పార్టిసిపేట్ చేసే ఈ షో మంచి రేటింగ్ తో దూసుకుపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు 8 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9 త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. పవర్ ప్యాక్డ్ హోస్ట్ గా సుధీర్ కనిపించబోతున్నాడు.  "సమ్మర్ వచ్చిందంటే పిల్లల టైం స్టార్ట్ ఐనట్టు... సాటర్డే, సండే వచ్చిందంటే డ్రామా జూనియర్స్ సీజన్ 9 స్టార్ట్ ఐనట్టు" అంటూ ఇంట్రో చెప్పాడు.

ఇక ఇందులో ఎవరి ఫ్యామిలీస్ డ్రీమ్ హీరో అంటూ హీరో శ్రీకాంత్ ని, గ్లామర్ క్వీన్ విత్ ఫైర్ అంటూ హీరోయిన్ రోజాని, కింగ్ ఆఫ్ ఫామిలీ హిట్స్ అంటూ అనిల్ రావిపూడిని చూపించారు. పిల్లల అభిమాన యాక్టింగ్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్   జీ 5 లో ఈ నెల 21 నుంచి జీ తెలుగులో ఈ నెల 23 నుంచి శని , ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతోంది.

 4 నుండి 14 సంవత్సరాల వయస్సున్న పిల్లలు వారి టాలెంట్ తో క్రీటివిటీతో స్కిట్స్ చేస్తూ అందరినీ అలరించే ఒక అందమైన వేదిక ఇది. ఇక డ్రామా జూనియర్స్ సీజన్ 1 నుంచి 8 వరకు ఎవరెవరు విన్నర్స్ అంటే సీజన్ 1 ప్రియాంక, సీజన్ 2 హర్షిత, సీజన్ 3 ప్రార్ధిని, సీజన్ 4 లో సీజన్ 2 గ్రూప్ , సీజన్ 5 ప్రజ్వల, సీజన్ 6 లోహిత్, సీజన్ 7 యోధీతా, సీజన్ 8 లో రిత్విక్ రెడ్డి గెలిచారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com