.webp)
డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ప్రోమో చూస్తే ఫుల్ కామెడీగా ఉంది. ఇందులో చిన్నారి శ్రీవియా మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్ డైలాగ్స్ తో నవ్వు తెప్పించింది. స్టేజి మీదకి రావడమే కోపంగా వచ్చింది. అది కూడా అనిల్ రావిపూడి మీద తెగ కౌంటర్లు వేసింది. రావడము ఒక స్నేక్ ని తీసుకొచ్చి పాల బోటిల్ ద్వారా పాలు తగ్గించింది. "అక్కా అక్కా అది పాము " అన్నారు అనిల్ రావిపూడి. "ఇది పాము కాదు అనిల్" అంటూ గట్టిగా అరిచి చెప్పింది శ్రీవియా. "పాముకు పాలు పడుతున్నావేంటి అక్కా " అన్నారు అనిల్. "ఇన్నాళ్లు పాముకు పాలు పట్టా" అంది అనిల్ ఇన్ డైరెక్ట్ గా తిడుతూ.
"నాకు కూడా కొద్దిగా గోరుముద్దలు పెట్టొచ్చుగా " అని అనిల్ అడిగేసరికి "అందుకే గోర్లు పీకేశా " అంది సీరియస్ గా శ్రీవియా. "మావయ్య మీరు ఊసరవెల్లిని చూసారా" అంటూ శ్రీకాంత్ ని అడిగింది. "చూడలేదే" అన్నారు శ్రీకాంత్. "అదిగో మీ పక్కనే ఉంది " అంటూ అనిల్ ని చూపించింది. వెంటనే అనిల్ "అలా అనకు అక్క నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేనేం తప్పు చేసానక్క " అన్నారు అనిల్ ఏడుపు ముఖంతో. " నీకు ఈ సొసైటీలో తమ్ముడు అనే హోదా ఇచ్చా. కానీ నాకు నువ్వేం ఇచ్చావ్ ..ప్రేమగా చూసుకునే నాకేమిచ్చావ్" అని అడిగింది సీరియస్ గా.
"ఏంటి కత్తి తెచ్చావ్ ఇది ఎవరికీ " అని అడిగాడు సుధీర్. "శ్రీకాంత్ మామకు..ఈ డ్రామా సామ్రాజ్యానికి మీరే కదా మామ రాజు. " ఇది రాజుకు ఇచ్చే కత్తా అమ్మా ఇంట్లో కట్ చేసేది తీసుకొచ్చి " అంటూ సుధీర్ డైలాగ్ వేసాడు. ఇక శ్రీవియా కోపం తగ్గించేందుకు స్టేజి మీదకు వచ్చారు అనిల్. "సుధీర్ కి లేదు అందం...తెంచుకుంటే తెగిపోతుందా మన బంధం " అంటూ పెద్ద డైలాగ్ చెప్పారు. "మీ బంధం కోసం నాకు అందం లేదన్నారు " అంటూ సుధీర్ ఫీలయ్యాడు.




.webp)
