.webp)
డ్రామా జూనియర్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో వచ్చేసింది. ఇందులో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి జడ్జెస్ ని ఫిదా చేసేసారు. శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఏటీఎం , శంకర్ దాదా గెటప్స్ వేసుకుని వచ్చారు. ఇక శంకర్ దాదా వచ్చి చిరంజీవి లాంటి వాయిస్ మోడ్యులేషన్ తో "అనిల్ గారు " అంటూ ఒక సైడ్ కి వచ్చి హ్యాండ్ తో నమస్కారం చేసాడు. అనిల్ రావిపూడి షాకైపోయి చెయ్యి ఊపాడు. ఇక ఏటీఎం ఐతే "ఆయన పక్కన చూడే" అనేసరికి శంకర్ దాదా గెటప్ లో ఉన్న చిన్నారి రాజాని చూసి తెగ సిగ్గుపడిపోయి అలా నడుచుకుంటూ వెళ్ళాడు. రోజా కూడా క్యూట్ గ నవ్వేసింది. ఇంతలో ఏటీఎం "అన్నా వ్వాకింగ్ స్టైల్ మార్చరాదే రోజా గారు చూస్తుర్రు " అన్నాడు.
వెంటనే శంకర్ దాదా వాకింగ్ స్టైల్ మార్చేశాడు. "హాయ్ రోజా " అంటూ వెళ్లి పలకరించాడు. దానికి రోజా నవ్వేసింది. "మళ్ళీ రోజా గారితో సినిమా ఎప్పుడు తీస్తావే " అంటూ ఏటీఎం అడిగాడు. "నెక్స్ట్ సినిమాలో తాను నాతో చేస్తుంది నాకు ముమ్మీగా "అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. "గదేందన్నా" అన్నాడు ఏటీఎం. "డబుల్ యాక్షన్ రా " అన్నాడు శంకర్ దాదా. ఇక అనిల్ ఆ శంకర్ దాదా గెటప్ బాయ్ ని చూసి "బాస్ స్టైల్ కుదిరింది. బాస్ వాక్ కుదిరింది. ఒక్కటే బ్యాడ్. బాస్ హెయిర్ స్టైల్ ..అది సుధీర్ హెయిర్ స్టైల్ లా ఉంది " అన్నాడు. ఇక ఫైనల్ గా అనిల్ శ్రీకాంత్ స్టేజి దిగి వచ్చి ఆ ఇద్దరు చిన్నారులతో కలిసి శంకర్ దాదా ఎంబిబిఎస్ సాంగ్ కి డాన్స్ చేసారు.




.webp)
