.webp)
జీ తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ 9 స్టార్ట్ ఐపోయింది. ఇక ఇందులో వస్తున్న చిన్నారుల్ని చూస్తుంటే వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్న స్కిట్స్ , చెప్తున్నా డైలాగ్స్ వింటుంటే వామ్మో వీళ్ళు పిల్లలా పిడుగులా అన్నట్టుగా ఉన్నారు. ఇక ముందుగా తేజస్విని - ముస్కాన్ అనే ఇద్దరు చిన్నారులు అనంతపురం నుంచి డ్రామా జూనియర్స్ కి వచ్చి సెలెక్ట్ అయ్యారు. ఇందులో ముస్కాన్ చేసిన కామెడీ తిప్పిన మూతి, చెప్పిన డైలాగ్స్ మాములుగా లేదు. రోజా అక్క అంటూ శ్రీకాంత అన్న అంటూ అనిల్ మామ అంటూ అందరినీ ఆట పట్టించింది. ఇక ఈ ఇద్దరు చిన్నారులు సుధీర్ మీద పడ్డారు. నువ్వు ముందు యాంకరింగ్ చేసి చావు అంటూ అరిచారు. ఇక ముస్కాన్ చేసిన హడావిడికి అనిల్ రావిపూడి ఫుల్ ఫిదా ఇపోయారు. "ముస్కాన్ నీ టైమింగ్ చాలా బాగుంది, నీ ఓవర్ యాక్షన్ బాగుంది , నీ బిల్డప్ బాగుంది." అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. దాంతో థ్యాంక్యూ అంటూ చెప్పేసరికి ఇది లేడీ దేవానంద్ అయ్యా అంటూ అనిల్ అనేసారు.
ఇక రోజా జడ్జ్మెంట్ ఇచ్చారు "చాలా క్యూట్ ఉన్నావ్ రా ముస్కాన్. పిట్టా కొంచెం కూత ఘనం" అన్నారు. ఇంతలో సుధీర్ "మాములుగా రోజా గారు అందరినీ సీరియస్ గా చూడడం చూసాను రోజా గారినే సీరియస్ గా చూస్తోంది" అంటూ కామెంట్ చేసాడు. దాంతో అనిల్ రావిపూడి "ముస్కాన్ మినీ రోజా కూడా " అన్నారు. ఇక శ్రీకాంత్ జడ్జ్మెంట్ చెప్తూ "ముస్కాన్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అనిల్ మాత్రం నెక్స్ట తన సినిమాలో అవకాశం ఇచ్చేస్తాడు" అన్నారు. "ఇచ్చేసినట్టే..లేదంటే అది వచ్చి కొట్టేలా ఉంది" అన్నారు అనిల్ రావిపూడి. ఇక ముస్కాన్ ఇప్పుడు 2 వ తరగతికి వెళ్తున్నట్టు చెప్పింది. ఇలా షోలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పుడే అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీలోకి సెలెక్ట్ ఐపోయింది.




.webp)
