Home

»

Tv News

అలీ చేతి నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా గొప్పోళ్ళు అవుతారు!

May 19, 2026

బుల్లితెర మీద ఇమ్మానుయేల్ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ అలా స్టార్ మా పరివారం షో ఆ తర్వాత బిగ్ బాస్ ఇలా ప్రతీ షోలో టాలెంట్ చూపిస్తూ పైపైకి ఎదుగుతూ వెళ్ళాడు. ఇక ఇప్పుడు కూకు విత్ జాతిరత్నాలు షోలో జాతిరత్నంగా వచ్చి మిగతా కమెడియన్స్ తో పాటు తానూ కూడా అంతకుమించి ఎంటర్టైన్ చేస్తూ ఆడియెన్స్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన కల నెరవేరింది అని చెప్పాడు. కూకు విత్ జాతిరత్నాలు షోలో   అది కూడా సీనియర్ కమెడియన్ అలీ చేతుల మీద డబ్బులు అందుకున్నాడు. ఆ తర్వాత తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

"సర్ బేసిక్ గా మీ చేతి నుంచి ఒక్క రూపాయి ఇచ్చినా కూడా వాళ్ళు చాల గొప్పవాళ్ళు అవుతారు లేదా గొప్పోళ్ళయితేనే ఇస్తారు అని ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. అలీ గారి చేయి చాలా మంచిది అంటారు. నేను ఎక్కువగా స్క్రిప్ట్స్ రాసుకుంది శ్రీనగర్ కాలనీలో మీ ఇల్లు ఉంది కదా సర్ పెంట్ హౌస్ లో ఒక ఇల్లు ఉంది కదా సర్ మా అన్న అందులో ఉంటాడు. నేను అక్కడే కూర్చుని స్క్రిప్ట్స్ రాసుకుంటూ ఉంటాను. ఇది ఆలీ గారి ఇల్లు ఇక్కడికి వచ్చిన ఏ ఆర్టిస్ట్ కైనా ఈ ఇల్లు కలిసొస్తుంది అని. మీ చెయ్యి చాల మంచిది అనుకున్నా సర్. అప్పటి నుంచి నేను చాలాసార్లు అనుకున్నా సర్ మీరు ఈ షోలో రాకేష్ అన్నకు డబ్బులు ఇస్తే నేను కూడా ఎలాగైనా ఆయన చేతి నుంచి ఒక్క రూపాయైనా తీసుకోవాలి అనుకున్నా సర్. నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది." అని చెప్పాడు ఇమ్మానుయేల్.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com