.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1047 లో..... రాజు, ఇందుల శోభనం జరగకుండా ఆపడానికి రేఖ, భూషణ్ ప్లాన్ చేస్తారు. రాజు మత్తుగా నిద్రపోవడానికి పాలల్లో ఈ ట్యాబ్లెట్ కలపమని భ్రమరాంబకు ఇస్తారు. భ్రమరాంబ ఆ టాబ్లెట్ స్థానంలో వేరొక ట్యాబ్లెట్ పాలల్లో కలుపుతుంది. రేఖ నువ్వు ఈ శోభనం ఆపాలని చూస్తున్నావ్ కానీ నేను జరగలని చూస్తున్నానని భ్రమరాంబ అనుకుంటుంది. మరొకవైపు ఇందుని స్వాతి, అపర్ణ రెడీ చేస్తారు. అప్పుడే ఇందు వాళ్ళ పిన్ని భ్రమరాంబ.. అమ్మా ఇందు ఈ పాలు తీసుకొని వెళ్లి అల్లుడికి ఇవ్వమని చెప్తుంది. సరే పిన్ని అని ఇందు అంటుంది. ఇందు మర్చిపోకు ఈ పాలు ఇద్దరు తాగండి అని భ్రమరాంబ మరి మరి చెప్తుంది.
ఎందుకు అంతలా చెప్తున్నావ్.. అందులో ఏమైనా కలిపావా అని అపర్ణ అడుగుతుంది. కలిపాను చెక్కర అని భ్రమరాంబ అంటుంది. మరొకవైపు శేషు గదిలో చేతికి మల్లెపూలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే అప్పుడే భ్రమరాంబ వస్తుంది. తను కూడా డ్యాన్స్ చేస్తుంది. ఇంతకి మన ప్లాన్ సక్సెస్ అంటావా అని భ్రమరాంబ ఆడుగుతుంది. మన శోభనం గుర్తు ఉంది కదా .. అంతకు పదిరెట్లు జరుగుతుందని శేషు అంటాడు. ఆ తర్వాత ఇందు పాల గ్లాస్ తో రాజు దగ్గరికి వెళ్లి సిగ్గుపడినట్లు.. రాజు తనని దగ్గరికి తీసుకున్నట్లు శేషు ఉహించుకొని శోభనం సక్సెస్ అని అరుస్తాడు. ఏంటి సక్సెస్ అని భ్రమరాంబ కోప్పడుతుంది. ఆ తర్వాత రాజుగా నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా పెళ్లి కాకముందే పెళ్ళాం వచ్చింది.. ఇప్పుడు శోభనం కూడా జరుగుతుందని అనుకుంటూ రాజు మురిసిపోతాడు. ఆ తర్వాత ఇందు శోభనం గదిలోకి ఎంట్రీ ఇస్తుంది.
పాల గ్లాస్ తీసుకొని రాలేదని అడుగుతాడు. మళ్ళీ పాల గ్లాస్ తో రా అని రాజు అంటుంటే.. విషం పట్టుకొని వస్తానని ఇందు కోపంగా మాట్లాడుతుంది. ఇందాక సిగ్గుపడ్డావ్ కదా అని రాజు అనగానే వాళ్ళ ముందు యాక్టింగ్ చేసానని ఇందు అంటుంది. ఇందుకి దగ్గరగా రాజు వస్తుంటే.. ఏయ్ ఏంటి దగ్గరికి వస్తున్నావని ఇందు కోప్పడుతుంది. నువ్వు దగ్గరికి వస్తే నేను గట్టిగా అరుస్తానని ఇందు అంటుంది. అయినా వినకుండా రాజు దగ్గరికి వెళ్తాడు. తరువాయి భాగంలో రాత్రి శోభనం జరిగిందని ఇంట్లో వాళ్ళు అనుకునేలా రాజు, ఇందు బెహేవ్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
