
బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ ఐన వ్యక్తి ఆదిరెడ్డి. ఈ రివ్యూస్ తో పాపులర్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 6 కి హౌస్ లోకి వెళ్ళాడు. అక్కడ టాస్కులు ఆడి టాప్ 5 లో నిలబడ్డాడు. ఆదిరెడ్డి భార్య కవితతో కలిసి ఇష్మార్ట్ జోడికి వెళ్లి టాస్కులు ఆడి ఇంకా ఫేమస్ అయ్యాడు. అలాంటి ఆది రెడ్డి రీసెంట్ గా ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. "ప్లీజ్ మా ఇంటి దగ్గరకు ఎవరూ రాకండి .
ఫండ్ రైజింగ్ కోసం హెల్ప్ కోసం కూడా దయచేసి ఎవరూ రావొద్దు. చాలా ప్రాబ్లంగా ఉంటోంది. రోజూ వస్తున్నారు. నేను ఇంకా వీడియోస్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తారు అందుకే చేయలేకపోతున్నాను. ప్రెజెంట్ మన హౌస్ అందరికీ తెలుసు. అందుకే వస్తున్నారు. ఒకప్పుడు హౌస్ తెలీనప్పుడు చాలా వీడియోస్ చేసాను కానీ ఇప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్ గా ఉంటోంది.
సో ప్లీజ్ అలా ఎవరూ రాకండి ప్లీజ్ ప్లీజ్. ఈ మధ్య కాలంలో పేషెంట్స్ ని కూడా తీసుకుని కూడా వస్తున్నారు. ప్లీజ్ అది చాలా బాధగా ప్రాబ్లమ్ గా ఉంటుంది. అర్ధం చేసుకోండి ప్లీజ్. " అంటూ ఒక ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టాడు. ఇక ఆదిరెడ్డి సోషల్ మీడియా కంటెంట్ చేస్తూ మరో వైపు బిజినెస్ చేస్తూ ఉంటాడు.




.webp)
.webp)
