Home

»

Tv News

ఈ సండే ఇంట్లోకి అయిదుగురు కొత్త కంటెస్టెంట్లు.. ఎవరంటే!

Oct 9, 2026 10:38AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో బిగ్ ట్విస్ట్ రాబోతోంది. ఈ సండే ఎపిసోడ్ లో ఏకంగా ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హౌస్ లో గేమ్ రసవత్తరంగా సాగుతుండగా ఈ కొత్త ఎంట్రీలతో హౌస్ లో మరింత హీట్ పెరగనుంది. నామినేషన్స్, ఎలిమినేషన్ లెక్కలు మొత్తం మారిపోతాయని అంటున్నారు.

ఈసారి వైల్డ్ కార్డ్ లిస్టులో ఐదుగురు ఉన్నారు. ఇన్ స్టా సెన్సేషన్ శ్వేత నాయుడు.. గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేస్తున్న బ్యూటీ. బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి సెలెక్ట్ అయిన రామకృష్ణ..‌టాస్కుల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నాడు. బుల్లితెర ఫేమస్ సీరియల్ యాక్టర్ శివ్  ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. డాన్స్ మాస్టర్ నీతు నటరాజ్ మాస్టర్.. తన స్ట్రాంగ్ పర్సనాలిటీ, డాన్స్ తో ఆకట్టుకుంటుంది. ట్రాన్స్ జెండర్ సంచలనం దక్షి గుత్తికొండ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా హౌస్ ని షేక్ చేయబోతోంది.

ముఖ్యంగా శ్వేత నాయుడు ఎంట్రీతో హౌస్ లో గ్లామర్ డోస్ పెరగడం ఖాయం..‌యూత్ ఆడియన్స్ కి ఫుల్ ట్రీట్. నీతు మాస్టర్ తన స్ట్రాంగ్ పర్సనాలిటీతో లేడీ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దక్షి తన లైఫ్ స్టోరీతో, బోల్డ్ నెస్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. రామకృష్ణ, శివ్ ఇద్దరూ కూడా గేమ్ లో ఫిజికల్ టాస్కుల్లో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఉన్న కంటెస్టెంట్లకు ఇది పెద్ద షాక్. ఈ సండే నాగార్జున ఈ ఐదుగురిని గ్రాంఢ్ గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. గత సీజన్లలో వైల్డ్ కార్డ్ లు వచ్చి టైటిల్ వరకు వెళ్లిన సందర్భాలున్నాయి. మరి ఈసారి ఈ ఐదుగురిలో ఎవరు హౌస్ ని రూల్ చేస్తారో, ఎవరు ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అవుతారో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం ఈ లిస్ట్ ఇప్పటికే వైరల్ అవుతోంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com