.webp)
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఈరోజు అందరి వర్త్ తేల్చే టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ స్టేజ్ మీద ఎవరు ఎంత వర్త్, ఎవరికి ఎంత స్పేస్ ఉంటుందో చెప్పాలని 15, 30, 45, 60 సెకన్లు అంటూ నాలుగు కేటగిరీల బ్యాడ్జ్ లను మెడలో వేయాలని చెప్పారు. దీంతో కంటెస్టెంట్లు ఒకరికొకరు బ్యాడ్జ్ లు ఇచ్చుకుంటూ తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు.
ఈ క్రమంలోనే షాలిని, రామకృష్ణ, అపూర్వ, రాజ్ కుమారి, ఝాన్సీల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. రామకృష్ణ, షాలిని ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. నీకు మాట్లాడటమే రాదంటూ షాలినిపై అపూర్వ ఫైర్ అయింది. షాలిని మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటుండటంతో ఆమెకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వొచ్చు కదా అని శ్రీముఖి కౌంటర్ వేసింది.
ఈ టాస్క్ లో చివరగా రోహిత్ వచ్చేసరికి 60 సెకన్ల బ్యాడ్జ్ మాత్రమే మిగిలింది. అయితే కావాలంటే స్వాప్ చేసుకోవచ్చనే పవర్ ఇచ్చారు. దీంతో రోహిత్ దీపక్ దగ్గర ఉన్న 45 సెకన్ల బ్యాడ్జ్ తీసుకుని తను వన్ మినిట్ బ్యాడ్జ్ పెట్టుకున్నాడు. అప్పుడు ప్రియాంకకు 45 సెకన్ల బ్యాడ్జ్ ఇస్తావా అని అడిగితే కాదు.. ఆమె 30 సెకన్ల వర్త్ అని చెప్పాడు. మరి 30 సెకన్ల బ్యాడ్జ్ తోనే స్వాప్ చేసుకోవచ్చు కదా అని జ్యూరీ ప్రశ్నించగా.. వాళ్లకు వన్ మినిట్ బ్యాడ్జ్ వర్త్ కాదు కదా అని రోహిత్ తెలివిగా సమాధానమిచ్చాడు. ఈ ఆన్సర్ కు జ్యూరీ ఫిదా అయింది. చివరకు 15 సెకన్ల బ్యాడ్జ్ వచ్చిన భాగీ, రామకృష్ణ, హేమంత్, అపూర్వ, అమన్ లకు లీడర్ అయ్యే ఛాన్స్ ఇస్తూ ట్విస్ట్ ఇచ్చారు.





.webp)
