
బిగ్ బాస్ సీజన్-10 లో ఏడో వారం పన్నెండు మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో కంటెస్టెంట్స్ టెన్షన్ లో ఉన్నారు. రెడ్ బాక్స్ , ఎల్లో బాక్స్, గ్రీన్ బాక్స్ టాస్క్ లు జరుగుతున్న నేపథ్యంలో నిన్న జరిగిన టాస్క్ లలో లేడి కంటెస్టెంట్స్ నుండి ఝాన్సీ, శ్వేత తమ సత్తా చాటారు. చివరి వరకు బాయ్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చారు. ఝాన్సీ ఏ గేమ్ అయినా ఫైనల్ వరకు వస్తుంది. ఒక్క అడుగు దూరంలో ఓడిపోతుంది. అయితే నిన్నటి గేమ్ లో శ్వేత కూడా ఝాన్సీలాగా టఫ్ ఫైట్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది.
శ్వేతని ఝాన్సీ పట్టుకోగా, షాలినిని దక్షి పట్టుకుంది. సుధీర్, రామ్ ప్రసాద్ గేమ్ ఆడారు. మరో రెండు గేమ్స్ అయితే టాస్క్ ముగుస్తుందనే సమయంలో సుధీర్, ఝాన్సీ, రామ్ ప్రసాద్ కలిసి ఆడారు. దాంతో బజర్ మోగగానే బోన్ పట్టుకోవడానికి పరుగెత్తారు అందరు. అందులో ఉన్న బోన్ మొదటగా సుధీర్ పట్టుకుంటాడు. ఇక దానిని లాక్కోవడానికి శ్వేత ప్రయత్నించగా రామ్ ప్రసాద్, ఝాన్సీ అందరు కలిసి శ్వేత, షాలినిని పట్టుకున్నారు.
శ్వేతని ఝాన్సీ పట్టుకోగా..వదిలెయ్ నన్ను వదిలెయ్.. మీరు ఇండివిడ్యువల్ గా ఆడండి.. గేమ్ ఆడండి. గ్రూప్ గేమ్ కాదని శ్వేత అంటుంది. షాలినిని దక్షి పట్టుకోగా.. నేను అన్నీ గుర్తుపెట్టుకుంటా.. మీరంతా ఆడేది రాంగ్ అని గ్రూప్ గేమ్ కాదని షాలిని ఫైర్ అయింది. సౌండ్ తగ్గించు.. అంత వాల్యూమ్ వద్దని దక్షి అనగానే నీ దగ్గర ఆ సౌండ్ ఏ లేదని షాలిని ఎగతాళి చేసింది. అయితే ఈ గేమ్ లో శ్వేత అల్టిమేట్ గా ఆడింది. అంతమంది తనకి అపోజిట్ గా ఆడినా చివరి వరకు ఒంటరిగా పోరాడింది. ఒకనొక స్టేజ్ లో త్రిగుణ్ కే పోటీ ఇచ్చింది. త్రిగుణ్ చేతిలో ఉన్న బోన్ ని లాక్కుంది శ్వేత. బాయ్స్ తో కలిసి పోటీపడి మరి చివరి వరకు వచ్చింది శ్వేత. ఇక మునుముందు గేమ్స్ లో తనని ఓడించడం కష్టమని నిన్నటి తన గేమ్ చూస్తుంటే అర్థమవుతుంది.





.webp)
