(3).webp)
బిగ్ బాస్ తెలుగు 10 - డే 18 ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు గట్టి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో గురువారం టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ టాస్క్ లో భాగంగా లివింగ్ ఏరియా స్క్రీన్ మీద ఒక్కో కంటెస్టెంట్ గురించి నెగెటివ్ కామెంట్లు ప్లే చేశాడు. ఝాన్సీ సింపథీ కోసం షర్ట్ వేసుకుంటోంది, ముఖేష్ గేమ్ డీవియేట్ అవుతున్నాడు. షాలిని బ్యాక్ బిచింగ్ స్టార్, ట్రిగ్గరింగ్ క్వీన్ అంటూ కామెంట్లు వచ్చాయి. ఇవి ఆడియన్స్ రియాక్షన్ అని అనుకుని కంటెస్టెంట్లు అంతా డల్ అయిపోయారు.
అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ కామెంట్లు రాసింది ఆడియన్స్ కాదు. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన అపూర్వ, మిథిలేష్, నవరసాలు రామకృష్ణలే ఆ కామెంట్లు రాశారు. కంటెస్టెంట్లు ఆ కామెంట్ల గురించి డిస్కస్ అవుతున్న టైమ్ లోనే గేట్ దగ్గర నుంచి ఈ ముగ్గురు సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసి ఇంటి సభ్యులంతా షాక్ అయ్యారు. గేట్ దాటి లోపలకు రావాలంటే మాత్రం మెజార్టీ ఓట్లు కావాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. దీంతో ముగ్గురూ తమ గురించి తాము పరిచయం చేసుకున్నారు. ఇక్కడ గ్రూపులు, మాస్టర్స్, పప్పెట్స్ ఉన్నారు, ఊసరవెళ్లి, గుంట నక్కలను బయటకు తీస్తా అని మిథిలేష్ అన్నాడు. పర్సనాలిటీ మిస్ అవుతోంది, అందరినీ ఎక్స్ పోజ్ చేస్తా, బట్టర్ ఫ్లైలా మారాలని ఉందని అపూర్వ చెప్పింది. జెన్యూన్ గా ఉంటా, ఎంటర్టైన్ చేస్తా అని రామకృష్ణ సింపుల్ గా చెప్పాడు. ఈ కామెంట్ల టాస్క్ తో హౌస్ లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది. తమ గురించి బయట ఇలా అనుకుంటున్నారా అని కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. కానీ ఆ తర్వాత అది వైల్డ్ కార్డ్ ల ప్లాన్ అని తెలియడంతో గేమ్ మొత్తం మారిపోయింది. మరి మిథిలేష్, అపూర్వ, రామకృష్ణ ముగ్గురిలో ఎవరికి హౌస్ లోపలకు వచ్చే ఛాన్స్ వస్తుందో చూడాలి మరి.
[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Day 18, Temptation vs Tension, Mithilesh, Apoorva, Navarasalu Ramakrishna, Bigg Boss Telugu Wild Card, Jhansi, Mukesh Gowda, Shalini, Trigun]




(6).webp)
(6).webp)
