.webp)
రన్ రాజా రన్ టాస్క్ తర్వాత బిగ్ బాస్ సుధీర్, వర్షిణిలకు హౌస్ మేట్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. గెలిచిన వాళ్లు హౌస్ మేట్ అవుతారని ఓడిపోయిన వాళ్లు హై రిస్క్ లోకి వెళ్తారని చెప్పారు. వాళ్లిద్దరి ముందు పెద్ద కేక్ ఇచ్చి ఎన్ని నిమిషాల్లో తింటారని అడిగారు. వర్షిణి 45 నిమిషాలు అనగా సుధీర్ 35 నిమిషాలు అని చెప్పారు. ఆ తర్వాత బిగ్ బాస్ ప్లేట్ మార్చాడు. ఇక్కడ టాస్క్ కేక్ తినడం కాదని ఆ కేక్ ని మేం పాడు చేయలేదని ఇంట్లో వాళ్లని నమ్మించాలని చెప్పారు. ఎక్కువ మంది నమ్మకాన్ని ఎవరు సంపాదిస్తారో వాళ్లు హౌస్ మేట్ అవుతారు.. మిగిలిన వాళ్లు హై రిస్క్ లోకి వెళ్తారని చెప్పాడు
అయితే మేం ఇద్దరం హౌస్ మేట్స్ అయ్యాం.. ఇద్దరం సేఫ్ అని డ్రామా లాడారు సుధీర్, వర్షిణిలు. వీళ్లు మనల్ని నమ్మించడానికి డ్రామాలాడుతున్నారని ముందే కనిపెట్టేశాడు రాంప్రసాద్. ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అని చెప్పిన మీరే కేక్ ఇచ్చి టాస్క్ కంప్లీట్ అయిపోయిందంటే ఎలా నమ్ముతామని రాంప్రసాద్ అన్నాడు. ఇక వంశీ కూడా ఆల్రెడీ బిగ్ బాస్ ఒక్కరే హౌస్ మేట్ అవుతారని చెప్పారు కదా.. వీళ్లొచ్చి ఇద్దరం అయిపోయాం అంటే ఎలా నమ్ముతాం.. మన చెవుల్లో పువ్వులు పెడుతున్నారు.. బిస్కెట్లు వేస్తున్నారని అన్నాడు. ఇంటి సభ్యుల్ని అందరిని పిలిచి మీరేం అబ్జర్వ్ చేశారో చెప్పండి అని ముఖేష్ ని అడిగారు బిగ్ బాస్. దాంతో ముఖేష్ వీళ్లు డ్రామాలు ఆడుతున్నారు.. కేక్ ని పూసుకుని వచ్చారంటూ గాలి తీసేశాడు.
దీంతో బిగ్ బాస్ వర్షిణి, సుధీర్ లు టాస్క్ లో ఫెయిల్ అయినట్టు ప్రకటించారు. మీకు అసలు సీరియస్ నెస్ లేదు కాబట్టి మీరిద్దరూ హై రిస్క్ లోకి వెళ్తారు. మీతో పాటు మరో ఇద్దరు అమన్, చైత్రలు కూడా హై రిస్క్ లో ఉన్నారు, ఈ నలుగురిలో ఒకరు ఈరోజు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే అమన్ టాస్క్ లు బాగా ఆడుతున్నాడు.. ఆడేటోడు ఆటలో ఉండాలని చెప్పిన త్రిగుణ్.. అమన్, వర్షిణిలలో ఎవరు బెస్ట్ అంటే వర్షిణి అని అన్నాడు. ఆ తర్వాత వర్షిణి, సుధీర్, అమన్, చైత్రలకు ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు బిగ్ బాస్. వర్షిణి మొదటిగా చైత్ర అన్ ఫిట్ అని చెప్పింది.. ఆ తర్వాత అమన్ కూడా చైత్ర పేరు చెప్పాడు.. సుధీర్ కూడా చైత్ర పేరే చెప్పాడు.. చైత్ర మాత్రం సుధీర్ పేరు చెప్పింది. నన్ను అందరూ వీక్ అంటున్నారు కానీ నాకు ఒక్క టాస్క్ కూడా రాలేదు.. ఛాన్స్ రాలేదు కాబట్టే ఆడలేదని చెప్పింది. ఎక్కువ ఓట్లు చైత్రకి పడటంతో చైత్ర ఎలిమినేట్ అయినట్టు బిగ్ బాస్ చెప్పాడు. చైత్ర ఎలిమినేట్ అనగానే వర్షిణి ఏడుపు స్టార్ట్ చేసింది..నామినేట్ చేసింది ఈమెనే..ఏడుస్తున్నదీ ఆమెనే. నిన్న చరణ్ విషయంలోనూ అదే చేసింది వర్షిణి. నిన్న చరణ్, నేడు చైత్ర వరుసగా ఇద్దరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి అని రాంప్రసాద్ అంటాడు. పాపం బిగ్ బాస్ నాలుగు రోజుల్లో ఇద్దరిని పంపించేశారని రాంప్రసాద్ అంటాడు. మొత్తానికి ఫస్ట్ వీక్ లో హౌస్ నుండి ఇద్దరు ఎలిమినేషన్ అవ్వగా ప్రస్తుతం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.




.webp)
