
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1 లో అనూష గురించి ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు. కామన్ మ్యాన్ క్యాటగిరీలో వచ్చి టాస్కులు కూడా ఆడింది. అలాంటి అనూష రీసెంట్ గా ఫామిలీ స్టార్స్ షోకి వచ్చి సోషల్ మీడియాలో తానూ ఎదుర్కున్న కష్టాల గురించి మాటల గురించి చెప్పుకొచ్చింది.
"ఎన్నో కామెంట్స్ ఎన్నో ట్రోల్స్ చూసాను కానీ ఒక్క కామెంట్ మాత్రం చాలా బాధపెట్టింది. నువ్వు కూడా చచ్చిపోవాల్సింది మీ నాన్నతో పాటు " అని ఉంది. అది నన్ను చాలా బాధపెట్టింది. "మేము చెప్తేనే ఏ విషయం ఐనా మా ఇంట్లో జరిగేది తెలుస్తుంది. కానీ ఒక మనిషి చనిపోతే ఆ ఫ్యామిలీని ఆ బాధ నుంచి బయటకు తేవడానికి ఎంత కష్టపడాలి అది వాళ్లకు తెలీదు. లాస్ట్ 10 ఇయర్స్ లో ట్యూషన్స్ చెప్పాను, జాబ్ చేసాను, యాంకరింగ్ చేసాను ఎన్నో మల్టిపుల్ జాబ్ చేసాను, కంటెంట్ క్రియేట్ చేసాను. మా అమ్మ ఇప్పుడిప్పుడే నవ్వుతోంది, ఇప్పుడిప్పుడే సరిగ్గా తింటోంది. ఇప్పుడిప్పుడే కొంచెం రెడీ అయ్యి బయటకు వెళ్తోంది. నా సిస్టర్ ని చదువు పూర్తిచేయించి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాను. ఫామిలీ గురించి కేర్ తీసుకునేది నేను మాత్రమే. ఎన్ని ట్రోలింగ్స్ ఐనా భరించొచ్చు కానీ ఒక మనిషిని నువ్వు చచ్చిపో అనకూడాదు. ప్రతీ ఒక్కరికి ఒక గౌరవం వాళ్లకు పెయిన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కామన్ కానీ ఇందులోంచి ఎలా బయటకు వచ్చావ్ అని నన్ను అడిగితే నేను ఇంత లైఫ్ లో నేర్చుకున్న పాఠం ఒక్కటే మనం ఎంత మంచి చేసినా పొడుస్తూ ఉంటారు. ఏదైతే ఆగదు. ఒక ఇంట్లోనే ఒక కూర అందరికీ నచ్చదు. అందుకే మన ఫామిలీ కోసం మనం నిలబడాలి అలా నిలబడాలి అంటే మనం స్ట్రాంగ్ గా ఉండాలి. పబ్లిక్ పర్సన్ ఐతే ఇంకా ఇలాంటివి చాలా వస్తాయి. ఎందుకంటే జనాలు వాళ్ళను తమ సొంత మనిషిలా అనుకుంటారు కాబట్టి ఇలాంటి ట్రోలింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. క్యారెక్టర్ ని అనేద్దాం ఫ్యామిలీని అనేద్దాం అనుకుంటారు. మనం ఎవరినీ మార్చలేము. మనం స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకంటే మనకు ఒక ఫామిలీ ఉంది ఒక ఫ్యూచర్ ఉంది కాబట్టి ఎక్కడా ఆగకుండా ముందుకెళ్లిపోవాలి." అని చెప్పింది.





.webp)
