Home

»

Tv News

Brahmamudi : ఇందు ఆఫీస్‌లోకి రాజు మాస్ ఎంట్రీ.. రేఖకు ఆంటోనీ మైండ్ బ్లోయింగ్ షాక్!

May 21, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1037 లో.. భ్రమరాంబ దగ్గర ఉన్న కార్ తాళాలు తీసుకొని రాజు వెళ్తాడు. మరొకవైపు శృతిని రేఖ తన క్యాబిన్ కి పిలుస్తుంది. ఎంప్లాయిస్ కి సాలరీ ఇచ్చేవరకు వర్క్ చెయ్యమని అంటున్నారని శృతి అంటుంది. రేఖ ఎంప్లాయిస్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా అదే మాట చెప్తారు. మీరు ఇక్కడ కాకుండా ఎక్కడికి వెళ్లిన కూడా మీకు వర్క్ ఉండదని రేఖ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది.

ఆ తర్వాత రాజు, ఇందు ఆఫీస్ కి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూసి రేఖ, భూషణ్ షాక్ అవుతారు. ఏంటే వాడిని తీసుకొని ఎందుకు వచ్చావని ఇందుని రేఖ అడుగుతుంది. వాడే నన్ను తీసుకొని వచ్చాడని ఇందు చెప్తుంది.నా కోపంగా భూషణ్, రేఖ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మా అమ్మనాన్న ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఆఫీస్ మళ్ళీ అలా అవుతుందని ఇందు వాళ్ళకి చెప్తుంది. ఇక ఆఫీస్ అంతా నేను చూసుకుంటాను.. మీకేం ప్రాబ్లెమ్ రానివ్వను.. వెళ్లి వర్క్ చేసుకోండి అని రాజు చెప్తాడు. అందరు లోపలికి వెళ్తారు. సర్ ఎవరు అని శృతి అడుగుతుంది. నా భర్త అని ఇందు చెప్పగానే శృతి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఆంటోని ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ శృతికి రేఖ ఫోటో చూపించి ఈవిడని పిలిపించండి అని చెప్తాడు. ఇతనేంటి రేఖ మేడం చిన్నప్పటి ఫోటో చూపిస్తున్నాడని శృతి అనుకుంటుంది. రేఖకి ఫోన్ చేసి ఆంటోనీ అని ఎవరో వచ్చారనగానే రేఖ కిందకి వస్తుంది. ఆంటోనిని చూసి రేఖ షాక్ అవుతుంది.

ఎందుకు వచ్చావని అడుగుతుంది. నీ కొడుకు నాతోనే ఉన్నాడు.. రోజు అమ్మ ఎక్కడ అని అడుగుతున్నాడని ఆంటోని చెప్పగానే రేఖ షాక్ అవుతుంది. నిజం చెప్పకుండా ఉండాలంటే నువ్వు నెలకి  నాకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఆంటోని అనగానే రేఖ ఏం చెయ్యలేక సరే అంటుంది. ఆ తర్వాత రాజు కార్ లో ఇష్టం వచ్చినట్లు తిరుగుతాడు. భ్రమరాంబ తన కార్ ని ఎక్కడ పాడు చేస్తాడోనని టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో రాజుని తన గ్రిప్ లో పెట్టుకోవడానికి రేఖ ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com