Home

»

Tv News

Ye Devi Varamo Neevu: అంజలి గతంపై తేలనున్న మిస్టరీ.. జానకమ్మకు గీతాంజలి తండ్రి వార్నింగ్!

Jul 14, 2026 9:56AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-07 లో ..శబరి అనాధాశ్రమంలో ఉన్నవాళ్ళు ఒక్కొకరుగా వెళ్ళిపోతుంటారు. వారందరిని రేవతి, అంజలి పంపిస్తుంటారు. అందరు ఏడ్చుకుంటూ వెళ్తారు. బాదపడకండి మనకోసం జానకమ్మ ఇలా చేసింది.. మీరందరూ బాగుండమే కావాలని అంజలి వారికి ధైర్యం చెప్తుంది. ఇక ఆశ్రమంలో అంజలి, రేవతి, ఒక చిన్నపాప మాత్రమే ఉంటారు. ఇక రేవతి ఒక దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే తనని అంజలి ఓదారుస్తుంది. వెళ్ళిపోయారు.. అందరు వెళ్ళిపోయారు.. కాసేపటికి నేను కూడా వెళ్తానని రేవతి ఏడుస్తుంటే జానకమ్మ మనకోసమే ఉంది కదా బాధపడకని అంజలి అంటుంది. ఎక్కడికి వెళ్లిందని అంజలి అడుగగా మా అందరికి దారిచూపింది కదా నీ దారికోసమే వెళ్ళినట్టుందని రేవతి అనగానే అంజలి ఆలోచనలో పడిపోతుంది. తను చిన్నప్పటి నుండి ఒక దగ్గర అమ్మ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ చోటికి వెళ్ళి బాధపడుతుంది అంజలి.

మరోవైపు జానకమ్మ హైదరాబాద్ కి వెళ్తుంది. అక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 కి వెళ్తుంది. అక్కడ గీతాంజలి వాళ్ళ నాన్న ఉంటాడు. ఇక జానకమ్మ లోపలికి వెళ్తుంది. కానీ అక్కడ డోర్ దగ్గర సెక్యూరిటీ తనని బయటకి వెళ్ళమంటాడు.  ఇక జానకమ్మ బయటకి వెళ్తుంటే గీతాంజలి వాళ్ళ నాన్న చూసి లోపలికి రమ్మంటాడు. ఇక లోపలికి వెళ్ళాక.. నేను శబరి అనాధాశ్రమం నుండి వచ్చాను.. శివశంకర్ సర్ ని కలవాలని జానకమ్మ అంటుంది. శివశంకర్ నా కొడుకే అని అతను అంటాడు. శివశంకర్ గారు ఇరవై ఏళ్ళ క్రితం నాకు ఒక బిడ్డని ఇచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డ పెద్దదైంది అని జానకమ్మ చెప్పగానే గీతాంజలి వాళ్ళ నాన్న షాక్ అవుతాడు.

ఇక అదే సమయంలో గీతాంజలి భర్త భానుచందర్ వస్తాడు. అతడిని చూసి గీతాంజలి వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. కంగారుపడతాడు. హాయ్ మామయ్య అని భానుచందర్ అనగానే లేచినిల్చుంటాడు. ఏంటి అల్లుడు సడెన్ గా వచ్చారని అతను అనగానే సడెన్ గా వచ్చేవాడినే అల్లుడు అంటారు.. అయినా మీరెందుకు టెన్షన్ పడుతున్నారని భానుచందర్ అనగానే అతను కవర్ చేస్తాడు. ఆ తర్వాత భానుచందర్ ని లోపలికి పంపించి జానకమ్మని బయటకు పంపిస్తాడు. జానకమ్మ ఏదో చెప్తుంటే మర్యదగా వెళ్ళిపోవమ్మా అని గీతాంజలి వాళ్ళ నాన్న అంటాడు. దాంతో జానకమ్మ ఏం చేయలేక బయటకు వస్తుంది. మరోవైపు గీతాంజలి ఇని స్టిట్యూట్ లో బోర్డు మీటింగ్ జరుగుతుంది. దానికి జీఎమ్ మనీష్ లేట్ గా వస్తాడు. అతడు లేట్ గా రావడం చూసి గీతాంజలి అతనికి వార్నింగ్ ఇస్తుంది. ఇకనుండి ప్రతీ ఇనిస్టిట్యూట్ లో మరో రెండు గంటలు పెంచుదామని అనుకుంటున్నానని గీతాంజలి అనగానే మిగిలిన బోర్డ్ మెంబర్స్ మీ నిర్ణయం సరైనదే అని అంటారు. కానీ జీఎమ్ మనీష్ మాత్రం .. రాంగ్ మేడమ్.. ఇప్పటికే స్టుడెంట్స్ మీద ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఇంకా టైమ్ పెంచితే వారిమీద ఇంకా ప్రెషర్ పెరిగి సరిగ్గా చదవలేరని జీఎమ్ మనీష్ అంటాడు. ఇక గీతాంజలి అతని నిర్ణయాన్ని ఏకీభవిస్తుంది. మీటింగ్ క్లోజ్ చేస్తుంది. మరోవైపు జానకమ్మ కోసం అంజలి వెయిట్ చేస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com