Home

»

Tv News

యాంకర్ జాను కొత్త కారు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Oct 27, 2026 10:11AM

యాంకర్ జాను - భాను అంటే ఇంతకు తెలీదేమో కానీ ఇప్పుడు అందరికీ తెలుసు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ రియాలిటీ షో ద్వారా వీళ్ళు అందరికీ పరిచయం అయ్యారు. అలాగే జాను తగ్గేదెలా అనే జెమినీ మ్యూజిక్ షోకి హోస్ట్ గా కూడా పని చేసింది. అలాగే కామెడీ రీల్స్ అవీ చేస్తూ ఉంటుంది. అలాంటి జాను మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో వాసంతి కృష్ణన్ - పవన్ కళ్యాణ్ జోడితో బాగా దగ్గరయ్యారు. ఇక ఈ రెండు జోడీలు కలిసి రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఇక జాను రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది. అది  కాస్తా వైరల్ అవుతోంది. మినీ కంట్రీ మ్యాన్ అనే కార్ కొన్నట్టు తెలుస్తోంది. ఆమె ఆ కార్ పక్కన నిలబడి ఉన్న పిక్స్ ని షేర్ చేసింది. అలాగే కేక్ ఫోటో కూడా అప్లోడ్ చేసింది. ఈ కార్ ధర వచ్చి సుమారు 60 లక్షల పైమాటే. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ జాను సన్నిహితులు స్నేహితులు అంతా కూడా కామెంట్స్ పెడుతున్నారు.

రోల్ రైడా ఐతే ఫైనల్లీ కొన్నారు కంగ్రాట్యులేషన్స్ అని చెప్పేసరికి థ్యాంక్యూ రా అని రిప్లై ఇచ్చింది. మిగతా నెటిజన్స్ అంతా కూడా కంగ్రాట్యులేషన్స్ అని చెప్తున్నారు. ఇక జాను ఒక సబ్జెక్టు తీసుకుని దాని మీద రీల్స్ చేస్తూ ఉంటుంది.  అలాగే ఈమె కొన్ని మూవీస్ లో సైడ్ రోల్స్ కూడా నటించింది. 2018 లో సవ్యసాచి మూవీలో, 2021 లో అఖండ మూవీలో, 2023 లో స్కంద మూవీలో నటించింది. ఇక అల వైకుంఠపురం అనే సీరియల్ లో  కూడా నటించింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com