Home

»

Tv News

41 ఏళ్ళు పూర్తయినా సీనియర్ నటుడిగా ఎప్పుడూ ఇంత కష్టపడలేదు

Aug 5, 2026 5:47PM

జబర్దస్త్ షో ఆదివారం సాయంత్రం టెలికాస్ట్ చేస్తున్న దగ్గర నుంచి చాలా మంది సీనియర్ టీవీ , మూవీ ఆర్టిస్టులంతా కనిపిస్తున్నారు. ఈ వారం స్కిట్ లో కిరీటి, శృతి సింగంపల్లి, బాబు మోహన్ వంటి సీనియర్స్ జూనియర్స్ అంతా స్కిట్స్ లో పార్టిసిపేట్ చేశారు.  ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఇక బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో బాబు మోహన్ ఎంట్రీ ఇచ్చేసరికి రష్మీ కూడా ఆయనతో డైలాగులు వేసింది. "అప్పుడెప్పుడో నేను మీకు ప్రొపోజ్ చేస్తే నన్ను మీరు పట్టించుకోలేదు. వేరే వాళ్ళను వెళ్లి పెళ్లి చేసుకున్నారు. " అంది రష్మీ. "అంగట్లో దొరికినట్టుగా " అంటూ బాబు మోహన్ డైలాగ్ మర్చిపోయేసరికి వెనక్కి ప్రాంప్ట్ చెప్పే అతను వచ్చి ఆయనకు డైలాగ్ చెప్పాడు. దానికి నాగబాబు  పడీ పడీ నవ్వాడు.

 ఇక బాబు మోహన్ రాఘవ టీమ్ లో చేశారు. "కథేంటో చెప్పు " అని బాబూమోహన్ అనేసరికి "అనగనగ ఒక రాజు గారు ఉన్నారు ఆయనకు ఏడుగురు కొడుకులు ఉన్నారు. అది ఫస్ట్ బిగ్ స్క్రీన్ మీద చూపించబోతున్నాం. ఎలా ఉంది గురువుగారు  " అని అడిగాడు  రాఘవ. "బానే ఉందయ్యా " అన్నారు బాబు మోహన్. ఇంతలో జబర్దస్త్ లేడీ గెటప్ మోహన్ వచ్చి "వచ్చేసారా బోర్ కొడుతోంది కథ చెప్పండి " అంటూ బాబు మోహన్ ని అడుగుతుంది. రైటర్ ప్రాంప్ట్ చెప్పేసరికి బాబు మోహన్ నవ్వేశారు.

"గురువుగారు రాత్రి ఐపోయింది మనం పడుకుందాం పదండి" అన్నాడు రైటర్ ప్రాంప్ట్ . "నా పెళ్ళాం అక్కడుందయ్యా " అన్నారు బాబు మోహన్. దాంతో అందరూ నవ్వేశారు. "అన్నయ్య మీరుండగా ఇంత ఘోరాలు జరుగుతున్నాయా " అంటూ నాగబాబుని అడిగారు బాబూమోహన్. "రైటర్ ప్రామ్ప్టింగ్ 41 సంవత్సరాలు పూర్తయినా సీనియర్ నటుడిగా ఇంత కష్టపడలేదు ఇంత చెండాలం చూడలేదు " అన్నారు. "మీరు పాత రోజుల్లా చేసి ఉంటే ఇంత నవ్వు రాదు. మీరు మధ్యలో ఎం చెప్పానురా అనడం . రాఘవ వింటున్నాడు అతను చెప్తుంటే " అంటూ నాగబాబు పడీ పడీ నవ్వేశారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com