Home

»

Tv News

 కాలర్ పట్టుకుని నిలదీసిన గోపిక.. అందరిని కడిగిపారేసిన చక్రి!

Oct 1, 2026 11:26AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -223 లో....చక్రికి ఆల్రెడీ పెళ్లయిందనే నిజం తెలియడంతో గోపిక తట్టుకోలేకపోతుంది. చక్రి తనకు పెళ్లయిందని, బస్టాప్ లో ఉండే అమ్మాయి తన భార్య అని ఫోటోలు చూపించి చెప్పడంతో గోపిక షాక్ అవుతుంది. ఛీ నువ్వు ఇలాంటి వాడివా.. ఇంత మోసం చేస్తావా.. ఇంక మన పెళ్లి ఎక్కడ చేయాలి.. పిల్లలు అంటూ ఎన్నెన్నో ఆలోచించాను కదరా..‌నన్ను ఎందుకు మోసం చేశావ్..‌ ఫోన్ నంబర్ ఎందుకు ఇచ్చావ్.. నాలో ఆశలు ఎందుకు రేపావంటూ చక్రి కాలర్ పట్టుకుని నిలదీస్తుంది గోపిక. ఆ తర్వాత ఏడుస్తూ వెళ్లిపోతుంది.

గోపిక ఆటోలో వెళ్తుంటే పెద్ది కూడా ఆటో ఎక్కి ఆమెకు తోడుగా ఇంటివరకు వెళ్తాడు. మరోవైపు ఆఫీసులో మహా మీద విక్కీ ఆశలు పెంచుకుంటాడు. అన్నయ్య అని పిలవను, రాఖీ కట్టనని మహా చెప్పిన మాటలను గుర్తు చేసుకుని గాల్లో తేలిపోతాడు. లక్కీకి కూడా తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని ఊహించుకుంటాడు. ఏదో పని వంక పెట్టుకుని మహా, దివ్య దగ్గరకు వెళ్లి ప్రాజెక్ట్ డిజైన్ ఇవ్వమంటాడు. నీ క్యాబిన్ ఇక్కడే కదా, మేం వస్తామని మహా అంటే నీ కోసమే విక్కీ ఇక్కడే ఉంటా అంటున్నాడు, నిన్ను లవ్ చేస్తున్నాడని దివ్య వెటకారంగా అంటుంది.

ఇదే సమయంలో కన్నా గాడు మహాకు ఫోన్ చేసి.. కొంపలు అంటుకున్నాయి..‌గోపిక ఇంటికి వచ్చింది.. పెళ్లయిన విషయం తెలిసి ఏడుస్తూ వెళ్లిందని చెప్తాడు.‌ ఇలానే కావాలి.. లేకపోతే మీ అన్న ఎంత చేశాడని‌ మహా అంటుంది. మరోవైపు చక్రి..‌ గోపికకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోందని కేశవతో చెప్తూ కంగారు పడతాడు. అప్పుడే పెద్ది వచ్చి చప్పట్లు కొడుతూ..‌ గొప్ప పని చేశావ్.. నాన్నకి రెండు పెళ్లిళ్లు అని ఉంది కదా.. నువ్వు కూడా ఆ పేరు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నావా.. ఒక అమ్మాయిలో ఆశలు పెంచుతావా.. బస్టాండ్ కి రంగురంగుల చొక్కాలు వేసుకుని వెళ్లడం ఏంట్రా.. నీకు పెళ్లయిందన్న సంగతి గుర్తుందా అని తిడతాడు.

దీంతో చక్రి అందరిని కడిగిపారేస్తాడు. ఆపు అన్నయ్యా, నాకు పెళ్లయిందా.. ఎవరు అనుకుంటున్నారు పెళ్లయిందని.. ఈ ఇంట్లో వాళ్లైనా గుర్తిస్తున్నారా..‌ నాక్కూడా సంతోషంగా ఉండాలని.. పెళ్లి, భార్య, పిల్లలు కావాలని ఉంటుంది. ఆ అమ్మాయికి కూడా నా పెళ్లి విషయం తెలుసనే అనుకున్నా.. పెళ్లయిందని ప్రత్యేకంగా ఎందుకు చెప్పడమనుకున్నా.. ఈమె ఏమో తన ఆఫీసులో బాస్ కి కజిన్ అని పరిచయం చేసింది. అలాంటప్పుడు నేను ఎలా అందరికి ఈ కజిన్ నా భార్య అని చెప్పగలను.. ఈమె ఎప్పుడైనా నన్ను భర్తగా చూసిందా.. ఈ పెళ్లిని పెళ్లిలా చూసిందా అని చక్రి ఎమోషనల్ గా ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com