Home

»

Tv News

  బజ్ ఇంటర్వ్యూలో శ్రిష్టికి షాకిచ్చిన శివాజీ!

Oct 6, 2026 12:02PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 నుంచి నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన శ్రిష్టి వ్యాకరణంతో హోస్ట్ శివాజీ బజ్ ఇంటర్వ్యూ చేశాడు. వైరల్ అవుతోంది. శివాజీ తనదైన స్టైల్ లో శ్రిష్టిని  ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. హౌస్ లోకి వచ్చినప్పుడు ఉన్న అంచనాలు, బయటకు వచ్చేటప్పుడు జరిగిన పరిణామాలపై శివాజీ నిలదీశాడు. సుధీర్ తో గొడవ, నాగార్జున క్లాస్ పై కూడా శివాజీ సూటిగా ప్రశ్నలు వేశాడు.

బజ్ లో శివాజీ అడిగిన ముఖ్య ప్రశ్న హౌస్ లో ఇంకా ముసుగు వేసుకుని ఎవరు ఆడుతున్నారు అనేది. దీనికి శ్రిష్టి ఏ మాత్రం తడుముకోకుండా ముగ్గురి పేర్లు చెప్పింది. ముఖేశ్, రామ్ ప్రసాద్, వర్షిణిలు ఇంకా మాస్క్ వేసుకుని ఉన్నారని శ్రిష్టి బాంబ్ పేల్చింది. ముఖేశ్ ఎలాంటి గేమ్ ఆడినా ఎవరికీ తెలియని స్ట్రాటజీ ఫాలో అవుతాడని, బయటకు మంచిగా నటిస్తాడని చెప్పింది. రామ్ ప్రసాద్ అగ్గిపుల్ల అంటించి సైలెంట్ గా వెళ్లిపోతారని, గొడవ పెట్టడంలో ఆయన దిట్ట అని చెప్పింది.

సుధీర్ తో తన గొడవ గురించి శివాజీ అడగగా శ్రిష్టి ఎమోషనల్ అయింది. తనకు పాత బ్రేకప్ ట్రామా ఉందని, సుధీర్ ఫోర్స్ గా లవ్ ట్రాక్ నడపాలని చూడడంతో తట్టుకోలేకపోయానని చెప్పింది. రోహిత్, త్రిగుణ్ చెప్పిన మాటల వల్లే తాను అలా రియాక్ట్ అయ్యానని, గుద్దితే పళ్లు రాలుతాయనేంత కోపం వచ్చిందని బజ్ లో ఓపెన్ అయింది. తను చేసింది తప్పే అయినా.. ఆ క్షణంలో తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయానని శివాజీ ముందు ఒప్పుకుంది.

ఇక తన సపోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ హౌస్ లో తనకు నిజమైన స్నేహితురాలు షాలినీ మాత్రమే అని శ్రిష్టి చెప్పింది. ఎలిమినేషన్ అనౌన్స్ చేసినప్పుడు షాలినీ కన్నీళ్లు పెట్టుకోవడం తనకు బాధ అనిపించిందని చెప్పింది. శివాజీ చివరగా నీ జర్నీకి నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావని అడగ్గా తను గేమ్ పరంగా ఫెయిల్ అయినా, నిజాయితీగా ఉన్నానని చెప్పింది. ఈ బజ్ ఇంటర్వ్యూ పూర్తి ఎపిసోడ్ త్వరలో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com