Home

»

Tv News

Brahmamudi: శోభనం డ్రామాతో రాజు హల్‌చల్.. వెంకీ కోసం చలపతితో గొడవ!

Jun 4, 2026 11:04AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmmudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1049 లో.. రాజు ఓవర్ యాక్టింగ్ చూసి నిజంగానే శోభనం అయిందని అందరు అనుకుంటారు. అప్పుడే పై నుంచి ఇందు వస్తుంది. ఒసేయ్ ఇందు ఒళ్ళంతా నొప్పులున్నాయి. వెళ్లి హాట్ వాటర్ పెట్టమని రాజు అనగానే.. ఏం మాట్లాడుతున్నావని ఇందు కోపంగా మాట్లాడుతుంది. ఏంటి మావయ్య భార్యని ఒసేయ్ అనకుంటే ఏం అంటారని శేషుని రాజు అడుగుతాడు. అవును భార్యని ఏమైనా అనొచ్చని శేషు అంటాడు. 

ఆ తర్వాత ఇందుని రేఖ పక్కకి తీసుకొని వెళ్తుంది. అదే సమయంలో రాజుని శేషు  పక్కకి తోసుకొని వెళ్తాడు. అల్లుడు నీకు నిజంగానే నైట్ శోభనం జరిగిందా... అయినా మీకు ఇది  ఫస్ట్ నైట్ ఎలా అవుతుంది.. ఆల్రెడీ ఉరుములు మెరుపులు అంటూ మొన్న చెప్పావ్ కదా అని శేషు అంటాడు. మామ నువ్వు వెళ్లి ఆయిల్ తీసుకొని వచ్చి మసాజ్ చెయ్ అని శేషుతో రాజు అంటాడు. అదంతా రేఖ విని వాడేంటి అలా మాట్లాడుతున్నాడు శోభనం జరగకూడదని పాలలో ట్యాబ్లెట్ కలిపాను అవి తాగలేదా అని రేఖ అనగానే తాగాడు ఆంటీ వాడు అలా బిల్డప్ ఇస్తున్నాడంతే రాత్రి ఏం జరగలేదు.. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది సీఈఓ గురించి అని ఇందు చెప్తుంది. 

మరొకవైపు రాజుకి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడి షాక్ అవుతాడు. నేను వెంటనే వస్తున్నానని రాజు అంటాడు. తర్వాత రాజు వెంటనే ఇంటికి వెళ్తాడు. చలపతి భోజనం చేస్తుంటాడు. వెంకీని చూసిన రాజు.. ఎందుకు ఇలా చేసావ్ రా ఇంత పిరికివాడివి ఏంట్రా అని కోప్పడతాడు. ఏంటి నాన్న అసలు మేం నీ కొడుకులమేనా.. తమ్ముడు అలా ఉంటే ఎలా తినబుద్ధి అవుతుందని రాజు అనగానే చలపతి షాక్ అవుతాడు. వాడికి ధైర్యం చెప్పాలి కదా అని రాజు అంటాడు. వాడు ఏం చేస్తాడురా అప్పులోళ్లు వచ్చి గొడవ పెడుతుంటే అలా చేసాడు.. ఇప్పటికైనా నువ్వు ఆ బిజినెస్ మానేసి జాబ్ చేసుకోరా వాడికి కొంచెం ధైర్యంగా ఉంటుందని రాజుతో చలపతి అంటాడు. లేదు నాన్న బిజినెస్ చేస్తున్నాను.. మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని రాజు చెప్తాడు. 

మరొకవైపు ఐశ్వర్య నిద్రలేచి ఇందు అని గట్టిగా అరుస్తు కిచెన్ లోకి వస్తుంది. పిలుస్తుంటే వినపడడం లేదా కళ్ళు నెత్తికెక్కాయా అని ఇందుని ఐశ్వర్య తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com