బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం టోటల్ డామినేష్ అని ముందే హింట్ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఒక్కో డ్యాగర్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఈ వారం పూర్తయ్యేలోపు.. ప్రతీ ఒక్కరూ రెండు లేదా అంత కంటే ఎక్కువ డ్యాగర్స్‌ని సంపాదించుకోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో రథ నిర్మాణం టాస్కులో రెడ్ టీమ్ టోటల్ డామినేషన్ చూపించింది. అందుకే బ్లూ టీమ్ అంతా కూడా నామినేషన్‌లోకి వచ్చారు. ఇక బ్లూ టీమ్ అంతా కలిసి ఓ ఇద్దరినీ ఎంచుకుని వారికే నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చింది. అలా త్రిగుణ్ , నరేష్ రెడ్ టీమ్ లోని మెంబర్లను నామినేట్ చేశారు. అలా నామినేషన్ ప్రాసెస్ అయితే పూర్తయింది. ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఈ డ్యాగర్స్‌ని సంపాదించుకోండని బిగ్ బాస్ హింట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎక్కువ ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారుతుందని బిగ్ బాస్ అంటాడు. డ్యాగర్స్ అన్నింటినీ కెప్టెన్ రూంలో పెట్టుకుని.. అందులోకి రావొద్దు అంటూ.. గేమ్ ముందుకు ఎలా వెళ్తుంది.. ఒక్క సారి ఆలోచించు అని అపూర్వకి మర్యాదగా చెప్తుంది షాలినీ.

మీరు ఫిజికల్ అయితే.. నేను అది పర్సనల్‌గా తీసుకుంటా.. ఫిజికల్ అవుదామంటే చెప్పండి మేం రెడీ అని రోహిత్ అంటాడు.త్రిగుణ్ అయితే ఓ డ్యాగర్‌ని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఝాన్సీ వస్తుంటే.. షాలినీ గట్టిగా అడ్డుపడుతుంది. మరోవైపు త్రిగుణ్‌ని కింద పడేసి అమన్ ఫిజికల్ అవుతాడు. ముఖేష్‌ని రోహిత్ తన చేతులతో బంధిస్తాడు. నరేష్‌కి ఏమైందని దేబ్జానీ అడుగుతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లి.. ఈ వేలు నొప్పి వస్తోందని చెప్తే.. ఇలా స్ప్రే కొట్టి పంపించాడట అని రామ్ ప్రసాద్ కామెడీ చేస్తాడు. దేబ్జానీ, వర్షిణి నవ్వేస్తారు. నన్ను రెచ్చగొట్టింది ముఖేష్.. ముఖేషు.. అని కామెడీ చేస్తాడు నరేష్. డ్యాగర్స్ వేటలో రెడ్ టీమ్ ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. ఇక కెప్టెన్సీ కోసం జరుగుతున్న ఈ టాస్క్ లో ఎవరు కెప్టెన్ గా నిలుస్తారో చూడాలి మరి.





