.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -616 లో.....తన ఆఫీస్ దగ్గర వల్లిని చూసి నర్మద షాక్ అవుతుంది. గొడవ చేయడానికి వచ్చావా, నేనే నిన్ను ఇంట్లో నుంచి గెంటేశానని చెప్పి బ్యాడ్ చేద్దామని వచ్చావా అని అడుగుతుంది. వల్లి చాలా నెమ్మదిగా .. అందుకోసం రాలేదు, నాకు నీ హెల్ప్ కావాలని చేతులు పట్టుకుని ఏడుస్తుంది. నేను పూర్తిగా మారిపోదామనుకుంటున్నా, నా తప్పులకు క్షమాపణ అడుగుతున్నా, నన్ను క్షమించేయ్ సెల్లాయ్ అని అంటుంది. పాత డ్రామానా, కొత్తగా ట్రై చేయ్, నక్క పెంపుడు కుక్కలా మారదని నర్మద అంటుంది.
నేను చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నా, ఓ ఫ్రెండ్ లా నా మార్పులో తోడు ఉండు, టైం పట్టినా పర్లేదు, ఆ ఇంటి పెద్ద కోడలిగా, చందు భార్యగా ఉండే అర్హత వచ్చిన రోజే నన్ను తీసుకెళ్లు అని వల్లి ఏడవడంతో నర్మద కరిగిపోతుంది. కళ్లు తిరిగి పడిపోబోతుంటే పట్టుకుంటుంది. అత్తయ్య చేసిన ఉప్మా తిను అని నర్మద అంటే ఆ ఇంటి భోజనం తినే అర్హత లేదని చెప్పేసి వల్లి వెళ్లిపోతుంది.
అప్పుడే ఓ వ్యక్తి వచ్చి ఫైల్ మీద సంతకం చేయమంటే ..రూల్స్ ప్రకారం కుదరదు అని నర్మద అంటుంది. ఆ వ్యక్తి.. అందరి చేతులు తడిపాం, ఆ సర్ కు రూ.10 వేలు లంచం ఇచ్చాం, ఫైల్ బట్టి రేట్ ఉంటుందని ఆ ఫైల్ లో సాగర్ సంతకం చూపిస్తాడు. దాంతో సాగర్ లంచాలు తీసుకుంటున్నాడని నర్మదకు తెలిసిపోతుంది. మరోవైపు సాగర్ ఆఫీసర్ .. రూ.30 లక్షల సొరచేప ఫైల్ ఉందని అంటే సాగర్ .. నాకు రూ.20 లక్షలు, మీకు రూ.10 లక్షలు" అని బేరం ఆడతాడు.
ట్రావెల్ ఏజెన్సీ దగ్గర రూ.12 లక్షల ప్రాపర్టీని రూ.30 లక్షలకు అడిగిన ధీరజ్ కి ఫైనాన్షియర్ .. లీజు ప్రాపర్టీకి రూ.15 లక్షలే ఇస్తానని నో చెబుతాడు. అప్పుడే చింతామణి ఎంట్రీ ఇచ్చి .. మీరు మనవాళ్లే, రూ.30 లక్షలు కాదు రూ.35 లక్షలు తీసుకోండి, రూ.5 వడ్డీ ఓకేనా అని ఆఫర్ ఇస్తుంది. ధీరజ్ ఓకే అనగానే .. డబ్బు తీసుకుని ఇంటికి వస్తా, పెద్దవాళ్లు సంతకం పెట్టాలని చెప్తుంది . చింతామణి వెళ్లి భద్రావతిని కలవడంతో ఇదంతా భద్రావతి ఆడిన కుట్ర అని తెలుస్తుంది. మనం వేసిన ఉచ్చులో కుందేలు పిల్ల చిక్కుకుందని భద్రావతి సైకో ఆనందం పొందుతుంది. ధీరజ్ ను ట్రావెల్స్ ఆఫీసులో పనోడిని చేయాలని ప్లాన్ చెప్తుంది . వల్లిని చూసి .. నిజంగానే మారావా, నిన్ను అడ్డుపెట్టుకుని రామరాజును 5 ఏళ్లు జైల్లో ఉంచుదామనుకున్నానని భద్రావతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
