Home

»

Tv News

Illu Illalu Pillalu: భద్రావతి మోసానికి షాకైన ప్రేమ.. వల్లిని క్షమించని ఫ్యామిలీ!

Oct 24, 2026 10:27AM

ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-613లో.. వేలంపాటలో 30 లక్షల ఒక్క రూపాయికి ధీరజ్ ట్రావెల్ ఏజెన్సీ గెలిచినట్లు ప్రకటిస్తారు. నా భర్తను ఎవరి ముందు ఓడిపోనివ్వను, గెలిపించానని భద్రావతి ముందు గొప్పలు చెప్తుంది ప్రేమ. కానీ భద్రావతి నవ్వుతూ.. నేను ఓడిపోవడం కాదే, కావాలనే ఇరికించాను. 12 లక్షలు కూడా చేయని ప్రాపర్టీని 30 లక్షలు కట్టేలా చేశాను, 18 లక్షలు నష్టం అని చెప్తుంది. వేలం వాళ్లు క్యాష్ ఎలా కడతారని అడిగితే టైమ్ ఉంటుంది కదా అని ప్రేమ అంటే, కట్టకపోతే 5 లక్షలు పెనాల్టీ పడుతుందని వాళ్లు చెప్పడంతో ధీరజ్, ప్రేమ షాక్ అవుతారు.

మరోవైపు వల్లి రైస్ మిల్లుకు చందుకు లంచ్ తీసుకెళ్తుంది. చందు చూసి కోపంతో.. భోజనంలో విషం కలిపావా, ధీరజ్, ప్రేమలను విడగొట్టావ్, ఇన్ని చేసిన నీకు నా ప్రాణాలు తీయడం లెక్కా అని తిడతాడు. నిన్ను చంపే ముందు క్షమించు బావా, నువ్వంటే ప్రాణం అని కాళ్లు పట్టుకుని ఏడుస్తుంది వల్లి. చందు కోపంతో తోసేయడంతో రామరాజు, తిరుపతి వచ్చి వల్లిని లేపుతారు. చేసిన తప్పులకు పశ్చాత్తాప పడుతున్నా, కేసు వాపస్ తీసుకున్నా‌నని వల్లి వేడుకోవడంతో రామరాజు.. నా పెద్ద కోడలు దేవత అని నమ్మి నిన్ను పెళ్లి చేసి కొడుకుకు బాధ కలిగించానని బాధపడతాడు.

 

చివర్లో భాగ్యం ఇంటికి ఎస్సై రావడం, ఆనందరావు భయపడుతూ.. వల్లి రెస్ట్ తీసుకుంటుందని అబద్ధం చెప్పడం జరుగుతుంది. వల్లి వచ్చి తిరుపతికి.. 6 లక్షల విషయంలో నిన్ను దొంగను చేశాను క్షమించండి అని చెప్తుంది. ఇంట్లో ధీరజ్ కోపంతో ప్రేమ లగేజ్ సర్ది గెంటేయబోతాడు. 12 లక్షల ప్రాపర్టీని 30 లక్షలకు పాడిందని చెప్పడంతో వేదవతి కళ్లు తిరిగి పడిపోతుంది. ప్రేమ మాత్రం.. ఈ బేబీ చూసుకుంటుందని ధీమాగా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com