Home

»

Tv News

పిల్లల కోసం టార్చర్ పెడుతున్నాడని చందుపై వల్లీ కొత్త కుట్ర!

Oct 8, 2026 10:59AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -599 లో..... ధీరజ్ రాత్రంతా వేదవతి, రామరాజుల దగ్గరే పడుకుంటాడు. వేదవతిని మధ్యలో రామరాజు లేపి మందులు ఇస్తాడు. నీ చిన్న కొడుకు మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి చూడు ఎలా పడుకున్నాడోనని రామరాజు అంటాడు. నేను అంటే వాడికి చాలా ప్రేమ అండీ, నాకు ఇలా అయ్యేసరికి తట్టుకోలేకపోయాడని వేదవతి అంటుంది. ఇక ప్రేమ కూడా అక్కడికే వచ్చి ఇక్కడే పడుకుంటా మామయ్యా, అమ్మకి ఏమైందా అని బాధపడుతూ పడుకోరు.. ఇక్కడైతే ప్రశాంతంగా పడుకుంటారని చెప్పి అక్కడే పడుకుంటుంది.

మరోవైపు వల్లీ ఏడుస్తూ ఉండడం రామరాజుకి వినిపించి బయటకు వచ్చి చూస్తే వల్లీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైంది వల్లీ ఏడుస్తున్నావని అడిగితే చందు తాగేశాడు.. తాగొచ్చి పిల్లలు పుట్టడం లేదని కొడుతున్నాడని వల్లీ కొత్త కథ అల్లుతుంది. రామరాజు షాక్ అవుతాడు. మీకు పెళ్లయి ఏడాది కూడా కాలేదు కదా అని అంటే వాళ్ల ఫ్రెండ్స్ కి పెళ్లయిన నెలల్లోనే భార్యలు నెల తప్పారంట.. నాలో ఏదో లోపం ఉందని హాస్పిటల్ లో చూపించుకోమని గొడవ పడుతున్నాడని చెప్తుంది. అంతేకాదు ధీరజ్ ప్రేమల్ని నేనే విడదీశానని, తిరుపతి బాబాయ్ మీద దొంగతనం నింద మోపానని నా మీద నిందలు వేస్తున్నాడు.. నర్మద కూడా ఎక్కిస్తోందని రామరాజుని నమ్మిస్తుంది వల్లి.

వల్లీ కన్నీళ్లని రామరాజు నిజమని నమ్మేస్తాడు. చందుని నిలదీస్తా అంటే ఇప్పుడు వద్దు అని వల్లీ అనేస్తుంది. రేపు ఉదయం వాడి సంగతి చెప్తానని రామరాజు అంటాడు. ఉదయం వల్లీ గదిలో రెడీ అవుతుంటే చందు చూసి రాత్రే వెళ్లిపోమంటే ఇంకా ఇక్కడే ఉన్నావ్ ఏంటే వెళ్లిపోమని అంటాడు. వల్లీ బతిమాలుతుండగానే రామరాజు వచ్చి మాటలతో మానసికంగా హింసించడమే కాకుండా కొట్టే వరకు వచ్చావా, నిన్ను చూస్తే అసహ్యంగా ఉందిరా.. నీలాంటి వాడు నా ఇంట్లో ఉండకూడదు వెళ్లిపోరా అని చందుని ఈడ్చుకొస్తాడు.

అందరూ ఏమైందని అడగడంతో వాడు ఏం చేశాడో తెలిస్తే నువ్వు ఇంట్లో నుంచి గెంటేస్తావని రామరాజు వేదవతితో చెప్తాడు. నేను అనుకున్నంత మంచోడు కాదు వీడు..‌పిల్లలు పుట్టడం లేదని వల్లీని వీడు సాధిస్తున్నాడు.. నరకం పెడుతున్నాడు, కొడుతున్నాడు, మానసికంగా హింసిస్తున్నాడని రామరాజు అందరి ముందు చందుపై నిందలు వేస్తాడు. నీ భార్య బంగారంరా, ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం, ఇలాంటి అమ్మాయిని బాధపెడితే దేవుడు కూడా క్షమించడరా అని చందుని కొడతాడు రామరాజు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com