Home

»

Tv News

బతుకమ్మ వేడుకల్లో హీరోయిన్ లయ.. గౌరమ్మలా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్!

Oct 15, 2026 2:22PM

సిల్వర్ స్క్రీన్ మీద లయ ఒకప్పుడు ఒక ఊపు ఊపింది తన అందంతో అభియనంతో. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. లాస్ట్ ఇయర్ హీరోయిన్ లయ నితిన్ తో కలిసి తమ్ముడు అనే మూవీ ద్వారా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే హీరో శివాజితో కలిసి సాంప్రదాయినీ, సుప్పిని, సుద్దపూసని అనే మూవీలో నటించింది.  ఇక సోషల్ మీడియాలో ఈమె ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అలాగే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1 షోకి రాధా, అనిల్ రావిపూడితో కలిసి జడ్జ్ గా కూడా వచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఆమె బతుకమ్మ గురించి రీసెంట్ గా పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.

" బతుకమ్మ ... పూల సౌందర్యానికి, మహిళా శక్తికి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక!   ప్రతి అందమైన దృశ్యం వెనుక ఒక అద్భుతమైన చూపు, ఎంతో అభిరుచి,   శ్రమ  ఉంటాయి.  ఈ వీడియోను ఎంతో అందంగా చిత్రీకరించిన  కెమెరా ఉమెన్ సంజనకు అభినందనలు!  మీ సృజనాత్మకత, సహనం, ఉత్సాహం, ప్రతి చిన్న విషయాన్ని గమనించే నైపుణ్యం ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాయి.  ఈ షూట్‌లో   ఉత్సాహంతో, సమన్వయంతో, అంకితభావంతో పనిచేసిన అందరికీ ప్రత్యేక అభినందనలు!  " అంటూ చెప్పింది.

ఈ వీడియోకి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జ్యోతక్క, సన ఐతే సో బ్యూటిఫుల్ అని చెప్పారు. "మీరంటే చాలా ఇష్టం ఉండేది మేడమ్ గారు.. ఇప్పుడు ఇష్టంతో పాటు చాలా గౌరవం  పెరిగింది... మీలాంటి వాళ్ళని చూస్తుంటే మీ ఆడవాళ్ళ కట్టు బొట్టులోనే మన భారతదేశ  తెలుగింటి ఆడపిల్లల మీద గౌరవం ఇంకా పెరుగుతుంది జై తెలంగాణ జై బతుకమ్మ ...ఎంత నేచురల్  గా ఉన్నారు అంటే.. బతుకమ్మను చేతినిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క ఉన్నారు... మేడం మీరు బతుకమ్మ సాంగ్ లో చేయడం చాలా బాగుంది మేడం" అంటూ లయ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com