.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -89 లో వారం రోజులు టైం ఇచ్చాము.. ఇక అంజలిని పంపించండి అని భవిత అంటుంది. అవును పంపించాలని గీత అనగానే వద్దు అత్తయ్య ఒకసారి ఆలోచించండి అని మనిష్ అంటాడు. అవునే ఒకసారి ఆలోచించు అని రత్నం అంటుంది. నువ్వు కింద పడిపోతే తానే ముందు చూసి అందరిని పిలిచింది. తనే నీకు రాత్రంతా సేవ చేసిందని రత్నం చెప్తుంది . అవునని బాను కూడా అంటాడు.
అవునా సరే ఒకసారి తనని రమ్మని చెప్పండి అని గీత అనగానే మనిష్ చాలా హ్యాపీగా అంజలి దగ్గరకు వెళ్లి అంజలి అత్తయ్య నిన్ను రమ్మంటుందని చెప్పి తీసుకొని వెళ్తాడు. అంజలి హ్యాపీగా లోపలికి వస్తుంది. నువ్వు నాకు ఏదో హెల్ప్ చేశావంట రాత్రంతా నా గదిలో ఉన్నావట, భవిత నువ్వు నా గదిలోకి వెళ్లి అన్నీ ఉన్నాయో చూడు అనగానే అందరు షాక్ అవుతారు. అంజలి బాధపడుతుంది. నువ్వు నాకు ఏదో సాయం చేసి ఇంప్రెషన్ కొట్టేయాలని చూశావ్ కదా అని అంజలిని తిడుతుంది. కానీ అసలు నిన్ను ఎప్పటికీ నమ్మను వెళ్లు ఇంట్లో నుంచి అని గీత అనగానే అంజలి ఏడుస్తూ వెళ్తుంది.
అంజలి వెళ్తుంటే మనిష్ అడ్డుపడి సారీ అత్తయ్య మీకు అడ్డు చెప్పినందుకు, అసలు దొంగతనం చేసింది ఎవరో కాదు భవిత అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో అంజలి చాలా హ్యాపీగా ఉంటుంది, మనీష్ తో బయటకు వెళ్దామని చెప్పి తనకి వాచ్ గిఫ్ట్ ఇచ్చి నువ్వు నాకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటావా అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
