
Brahmamudi: అపర్ణ టెన్షన్..మాంగళ్యబలమే రాజు ప్రాణాలని కాపాడగలదా!స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-1169 లో..ఇంట్లో అందరూ కార్లలో వెళ్లిపోవడంతో రేఖ, భూషణ్, భ్రమరాంబ, శేషులకు కారు లేక అవమానం ఎదురవుతుంది. కోపంతో రేఖ టీవీ రిమోట్ ను కొడుతుంటే శేషు బ్యాడ్ టైం లో రిమోట్ కూడా మాట వినదని వెటకారంగా అంటాడు. ఆ తర్వాత వసంతను కాఫీ అడిగితే అపర్ణ, సుభాష్ ల పెళ్లిరోజు స్పెషల్ వంటల్లో ఉన్నానని చెప్పి రేఖను అవమానిస్తుంది.
అదే టైంలో గుడికి వెళ్లిన అపర్ణ, సుభాష్ లకు స్వామిజీ షాకింగ్ న్యూస్ చెప్తాడు. వారం పది రోజుల్లో రాజుకు ప్రాణగండం ఉందని, బతకాలంటే వెంటనే రాజు, ఇందుల పెళ్లి జరిగిపోవాలని, ఇందు మాంగల్య బలమే రాజును కాపాడుతుందని చెప్తాడు. అటు రాజు, ఇందు ఆఫీస్ కి వెళ్తుండగా కారు యాక్సిడెంట్ తృటిలో తప్పించుకుని అపర్ణకు ఫోన్ లో యమలోకం నుంచి తప్పించుకున్నామని చెప్పడంతో అపర్ణ భయం మరింత పెరుగుతుంది.
మరోవైపు అవమానాలతో రగిలిపోయిన రేఖ మళ్లీ పాత రేఖలా మారి సుభాష్ ను చంపేసి ఇంట్లో భయం పుట్టించాలని ప్లాన్ చేస్తుంది. కానీ శేషు టైం బాలేనప్పుడు చేసే పని మనకే తగులుతుందని హెచ్చరిస్తాడు. చివర్లో వెంకీ తన కంపెనీలో జరుగుతున్న ఫ్రాడ్ వెనక ఐశ్వర్య కంపెనీ ఉందని రాజుకు చెప్పడంతో రాజు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
