Home

»

Tv News

Brahmamudi : లక్కీ, ఐశ్వర్యల పెళ్ళి.. రేఖ ప్లాన్ ఏంటి!

Oct 15, 2026 11:12AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1162 లో.....లక్కీ తాళి కట్టబోతుంటే ఐశ్వర్య ఆపండి అంటూ అరిచి అందరికి షాక్ ఇస్తుంది. పంతులు కూడా తన జీవితంలో పెళ్లికూతురే పెళ్లి ఆపడం ఇదే మొదటిసారి చూడటం.. ఇది ఎనిమిదో వింత అంటూ కామెంట్ చేస్తాడు. పెళ్లికి ముందే కంపెనీ పెట్టిస్తానన్న అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వలేదని, అందుకే పెళ్లి వద్దంటున్నానని ఐశ్వర్య తెగేసి చెప్తుంది. ముహూర్తం దాటిపోతుందని పంతులు చెప్పినా వినకుండా పేపర్స్ కావాల్సిందేనని పట్టుబట్టింది. ఇందు లోపలికి వెళ్లి పేపర్స్ తీసుకొచ్చి ఐశ్వర్య చేతిలో పెడుతుంది.‌అయినా ఐశ్వర్య ఆగలేదు. ఇందులో ఏముందో చదవాలని లాయర్ కి ఫోన్ చేసి పిలిపించి.. లాయర్ వచ్చి అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయని చెప్పడంతోనే ఐశ్వర్య తాళి కట్టించుకుంటుంది

తాళి కట్టగానే దండలు కూడా మార్చుకోకుండా ఐశ్వర్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అందరు షాక్ అవుతారు. తర్వాత స్వాతిని పక్కకు తీసుకెళ్లి ఇందు తిడుతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ముందే ఎందుకు చెప్పలేదని నిలదీస్తుంది. స్వాతి ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో పంతులు ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టి వెళ్లిపోతాడు. స్వాతి ఇంటికి వెళ్తుంటే రేఖ డబ్బులు ఇవ్వబోతుంది. మదన్ కి తెలిస్తే కోప్పడతాడని స్వాతి డబ్బులు తీసుకోకుండా వెళ్లిపోతుంది. ఇందు పాలు తీసుకొని ఐశ్వర్యకు ఇవ్వడానికి వెళితే, గంట ముందే ఐశ్వర్య రూమ్ లోకి వెళ్లిపోయిందని అపర్ణ చెప్తుంది. దీంతో ఇందు ఆ పాలను రాజుకు ఇచ్చి లక్కీకి ఇవ్వమని చెప్తుంది. రాజు పాలు తీసుకెళ్లి లక్కీకి ఇచ్చి గదిలోకి పంపిస్తాడు. ఇక్కడి నుంచి అసలు ఫన్ మొదలవుతుంది.

పెళ్లికూతురులా లక్కీ చేతిలో పాల గ్లాసుతో శోభనం గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్లిన లక్కీని ఐశ్వర్య పురుగు కన్నా హీనంగా చూస్తూ ఫైర్ అవుతుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావ్ అంటూ లక్కీపై అరుస్తుంది ఐశ్వర్య. దీంతో లక్కీ డల్ అవుతాడు. మరోవైపు మదన్ కోసం రేఖ ఎమోషనల్ అవుతుంది. తన కొడుకు జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతుంది. స్వాతి ఇంటికి వెళ్లాక మదన్ ఏం రియాక్ట్ అవుతాడోననే టెన్షన్ లో రేఖ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com