స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -983 లో..... ఇందు స్వాతి గదిలోకి వచ్చి నవ్వుకుంటారు. భలే కవర్ చేసావని ఇందు అంటుంది. అసలు ఇంటర్వ్యూ ఏమైందని స్వాతి అడుగుతుంది. అంత ఒకే అవుతుంది అనుకునే టైమ్ లో ఒక వెస్ట్ ఫెల్లో వచ్చి చెడగొట్టాడని ఇందు చెప్తుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ని అడిగాను. ఇక నాకు ఎవరు తెలియదని స్వాతి అనగానే పర్లేదే ఏదైనా జాబ్స్ కి అప్లై చేస్తాను.. అవసరం ఉంటే వాళ్ళు మెయిల్ చేస్తారు కదా అని ఇందు అంటుంది. మరొకవైపు బారెడు పొద్దు ఎక్కిన రాజు నిద్ర లేవకపోయేసరికి అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి లేపుతాడు.
ఇంతకు బండి ఎక్కడరా అని అతను అనగానే అంత మీ చిన్న కొడుకు వెంకీకి తెలుసు.. వాడు తన ఫ్రెండ్ కి ఇచ్చాడు.. పోలీసులు తీసుకొని వెళ్ళారాని వెంకీ మీదకి రాజు తోసేస్తాడు. వెంకీ తను ఎక్కడ పబ్ కి వెళ్ళిన విషయం తెలుస్తుందో అని సైలెంట్ గా ఉంటాడు. మరొకవైపు ఐశ్వర్య మళ్ళీ తన ఫ్రెండ్ కి కాల్ చేసి పార్టీ అంటూ డిస్కషన్ చేస్తుంది. దాంతో స్వాతి వచ్చి రాత్రి అంత జరిగింది కదా.. ఇంకా బుద్ది రాలేదా.. ఎందుకు ఇలా చేస్తున్నావని ఐశ్వర్యతో స్వాతి అంటుంది. నీకు ఏంత ధైర్యం అని ఐశ్వర్య చెయ్ ఎత్తుతుంది. దాంతో ఇందు వచ్చి ఆపుతుంది. స్వాతి చిన్నపిల్ల తనని చుస్తే నీకు ఎలా కొట్టాలని అన్పిస్తుందని ఇందు అనగానే ఐశ్వర్య కోప్పడుతుంది. మనం తోబుట్టువులమని ఇందు అనగానే మీ అమ్మ మా అమ్మ అక్కచెల్లెలు అంతే. నీ స్థాయి వేరు నా స్థాయి వేరు అని ఐశ్వర్య అంటుంది. నాకు అన్ని తెలుసు.. మీ అమ్మ, మా నాన్నని నానమ్మని చంపేసింది. అందుకే నువ్వు అసలు నచ్చవని ఐశ్వర్య అంటుంది.
అదంతా రేఖ వింటుంది. వచ్చి నా మేనకోడలు మాట్లాడిన దాంట్లో తప్పేముందని అంటుంది. ఈ స్వాతికి ఎవరితో స్నేహం చెయ్యాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదని భ్రమరాంబ అంటుంది. ఆ తర్వాత నువ్వు ఇక్కడ పనులు అన్ని పూర్తిచేసి వంట చెయ్యడానికి బయటకి వెళ్ళాలి గుర్తు ఉంది కదా అని రేఖ అనగానే గుర్తు ఉంది ఆంటీ అని ఇందు అంటుంది. ఆ తర్వాత ఇందు పరిస్థితి చూసి ఇక రేఖ పేరున ఉన్న పవర్ అఫ్ అటార్నీని ఇందు పేరున మార్చాలని అపర్ణ అనగానే సుభాష్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




