.webp)
బిగ్ బాస్ సీజన్-10 ఎనిమిదో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఈ వారం మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వంశీ, సుధీర్, రామ్ ప్రసాద్, వర్షిణి, శివ, ఝాన్సీ, రోహిత్, రామకృష్ణలు నామినేషన్ లోకి వచ్చారు. ఈ ఎనిమిది మందిలో ఒకరు ఈ వారం ఇంటి ముఖం పట్టబోతున్నారు. నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. జడ్జీలుగా ఉన్న ముఖేష్, త్రిగుణ్, అమన్, దేబ్జానీ, నీతూలు చాలా కీలక పాత్ర పోషించారు. వాళ్ళ నిర్ణయాలతోనే నామినేషన్స్ జరిగాయి.
శివకి ఇద్దర్ని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు జడ్జీలు. దాంతో శివ సుధీర్, వంశీలను ఎన్నుకున్నాడు. వంశీని నామినేట్ చేస్తూ ముఖేష్ నామినేషన్స్ లో లేవనెత్తిన అంశాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పాడు. దాంతో ముఖేష్ కి రోషం తన్నుకుని వచ్చింది. నా పేరు ప్రస్తావించకు, నామినేషన్ చేయడం రాకపోతే కోర్టు నుంచి వెళ్ళిపో అంటూ అడ్డదిడ్డమైన వాదనకు దిగాడు. ముందు నా పాయింట్ విను, మధ్యలోకి రాకు అని శివ చెప్పడంతో దేబ్జానీ మధ్యలో అడ్డుపడకు ముఖేష్ అని అంది. దాంతో ముకేష్ నువ్వు మెయిన్ జడ్జీవి కాదు అని ఆమెపై ఫైర్ అయ్యాడు.
సుధీర్ ని నామినేట్ చేస్తూ శివ మిస్టర్ బ్యాక్ ఫుట్ అని పేరు పెట్టాడు. హోస్ట్ గారు హోప్ లెస్ కెప్టెన్ అన్నారు కానీ నేనైతే వేస్ట్ కెప్టెన్ అని అనుకుంటున్నా అని అన్నాడు. ఈ ఇంట్లో చాలా సేఫ్ గా గేమ్ ఆడతాడు అని అన్నాడు. నేను హౌస్ లోకి రాగానే ఈ ఇంట్లో మీరు ఎవరితోనైనా పెట్టుకోండి, త్రిగుణ్ తో పెట్టుకోవద్దు అని చెప్పిన సేఫ్ ప్లేయర్ ఇతను అని అన్నాడు. ఒక మాటపై నిలబడడు, ఇతనో షాడో అని అన్నాడు. సుధీర్ నువ్వు నోరు మూసుకో శివా అని అంటే సరే సర్ అంటూ హుందాగా నవ్వాడు.






