Brahmamudi : అప్పుకి సపోర్ట్ గా కళ్యాణ్.. ఆ ఫొటో చూసేసిన రాజ్!
on May 18, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -724 లో... అప్పు డ్యూటీకి వెళ్తుంటే ధాన్యలక్ష్మి ఆగమంటుంది. నువ్వు డ్యూటీకి వెళ్ళడానికి వీలు లేదు.. జాబ్ మానెయ్.. హౌస్ వైఫ్ గా ఇంట్లోనే ఉండి నా కొడుకుని చూసుకోమని ధాన్యలక్ష్మి అంటుంది. ఎందుకు అలా అంటున్నావని ప్రకాష్ కోప్పడతాడు. పిల్లలు సంసారం గురించి ఆలోచించడం లేదని ధాన్యలక్ష్మి అంటుంది.
కళ్యాణ్ కష్టపడి తన భార్యని పోలీస్ చేసాడు. నువ్వు అలా అంటావేంటి అని ఇందిరాదేవి అడుగుతుంది. అదే సమయంలో 'అమ్మ తనకి జాబ్ చెయ్యడం ఇష్టం' అంటూ కళ్యాణ్ అప్పుకి సపోర్ట్ గా మాట్లాడుతాడు. ఆ మాటలన్నీ విన్న ధాన్యలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత అప్పుని డ్యూటీకి వెళ్ళమంటాడు కళ్యాణ్. నువ్వు అలా భార్యని అర్థం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని కళ్యాణ్ తో అపర్ణ అంటుంది.
ఆ తర్వాత రుద్రాణి ఆఫీస్ ఎంప్లాయి కి కాల్ చేసి కావ్య కి ఫోన్ చేసి ఆఫీస్ లో వర్క్ ఉందని చెప్పమంటుంది. దాంతో ఆ ఎంప్లాయి కావ్యకి ఫోన్ చేసి మీరు ఆఫీస్ కి రావాలని చెప్తాడు. ఇక కావ్య ఆఫీస్ కి రెడీ అయి వెళ్తుంటే సుభాష్, ప్రకాష్ వద్దని అంటారు. ఆఫీస్ గురించి మేమ్ చూసుకుంటామని చెప్పి కావ్యని ఆపుతారు.
ఆ తర్వాత ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి యామినికి ఫోన్ చేసి చెప్తుంది. ఇద్దరు కలిసి వేరొక ప్లాన్ చేస్తారు. అదంతా స్వప్న చాటు నుండి వింటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఎందుకు వచ్చారన్నట్లుగానే రాజ్ తో కావ్య మాట్లాడుతుంది.
తరువాయి భాగంలో కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోని రాజ్ చూసేలా రుద్రాణి సెట్ చేస్తుంది. రాజ్ ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
