Home

»

Exclusive Movie News

టెలిఫోన్ ధ్వనిలా నవ్వే దానా: ఈ క్లాసిక్ రొమాంటిక్ సాంగ్ లిరిక్స్‌లో ఉన్న మ్యాజిక్ తెలుసా.?

Oct 26, 2026 4:57PM

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాలోని ‘టెలిఫోన్ ధ్వనిలా’ పాట ప్రేమలోని మధురమైన అనుభూతులను అందంగా ఆవిష్కరిస్తుంది. టెలిఫోన్ మోగినప్పుడు కలిగే ఆనందాన్ని, ప్రియమైన వ్యక్తి నుంచి వచ్చే పలకరింపు మనసులో రేపే అలజడిని పోలుస్తూ ఈ పాట సాగుతుంది.

ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, హరిహరన్–హరిణి గాత్రాలు, భువనచంద్ర సాహిత్యం కలిసి ఈ పాటను ప్రత్యేకమైన అనుభూతిగా నిలబెట్టాయి.

ఈ పాటలోని ప్రత్యేకత కేవలం సంగీతం, గాత్రం మాత్రమే కాదు. ప్రేమలో ఉన్నవారికి పరిచయమైన చిన్న చిన్న భావోద్వేగాలను ఉపమానాలుగా మార్చి చెప్పడంలోనూ ఉంది.

పల్లవి:
టెలిఫోన్ ధ్వనిలా నవ్వే దానా
మెల్బోర్న్ మెరుపులా మెరిసే దానా
డిజిటలలో చెక్కిన స్వరమా
ఎలిజిబెత్ టేలర్ తరమ
జాకిర్ హుస్సేన్ తబలా నువ్వేనా ఆ

సోనా సోనా నీ అందం చందనమేనా
సోనా సోనా నువ్వు లేటెస్ట్ సెల్యూలర్ ఫోన్ ఆ
కంప్యూటర్ తో నిన్ను ఆ బ్రహ్మయే మలిచేనా

భావం:
ప్రేమికుడు తన ప్రియురాలిని కేవలం అందగత్తెగా మాత్రమే చూడటం లేదు. ఆమె నవ్వు, గొంతు, అందం, వ్యక్తిత్వం అన్నీ తనకు ప్రత్యేకమైన అద్భుతాలుగా కనిపిస్తున్నాయి. వాటిని వర్ణించడానికి అప్పటి ఆధునిక సాంకేతిక పదాలను ఉపయోగించడం వల్ల ఈ పాటకు ప్రత్యేకమైన చిలిపితనం, కొత్తదనం వచ్చాయి.

చరణం 1:
నువ్వు లేని నాడు ఎండే ఉండదులే
చిరు చినుకే రాలదులే
నువ్వు లేని నాడు వెన్నెల విరియదులే
నా కలలే పండవులే

నీ పేరు చెబితే శ్వాస పెదవి సుమ గంధమౌను చెలి
నువ్వు దూరమైతే వీచే గాలి ఆగిపోవునులే

నువ్వు లేకపోతే ఝరులే ఉండవులే
కొండకి అందం ఉండదులే
నువ్వు రాకపోతే ప్రాణం నిలువదులే
వయసుకి ఆకలి పుట్టదులే

నీవే నదివై నను రోజు నీలో ఈదులాడని
సిగ్గేస్తుంటే నీ కురులతో నిన్నే దాచేసుకో

భావం:
ప్రేమికులు ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఉన్న ఇష్టాన్ని ప్రకృతితో పోలుస్తూ వ్యక్తపరుస్తున్నారు. నువ్వు లేకపోతే నిద్ర రాదు, ఆకలి పుట్టదు, అసలు ప్రాణమే నిలవదు అంటూ తమ ప్రేమని అందంగా చాటి చెబుతున్నారు.

చరణం 2:
నీ పేరు ఎవరు పలుకగా విడువనులే
ఆ సుఖమును వదలనులే
నీ జల్లో పూలు రాలగ విడువనులే
ఆ ఎండకు వదలనులే

ఏ కన్నె గాలి నాదే తప్ప నిను తాకనివ్వను
ఏనాడు నిన్ను మదర్ థెరెసాతో తప్ప పలుకనివ్వను

నువ్వు వెళ్లే దారి పురుషులకొదలనులే
పర స్త్రీలను విడువనులే
నీ చిలిపి నవ్వు గాలికి వదలనులే
ఎద లోయలో పదిలంలే

షోరూముల్లో స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను
ఈ చేతితో కలలో సైతం నిను దాటనివ్వను

భావం:
నువ్వు నాకు మాత్రమే సొంతమని ప్రేమికులిద్దరూ ఎంత అందంగా చెప్పుకుంటున్నారు. నీ పేరు పలికే అదృష్టం ఎవరికీ ఇవ్వనని, తాను మాత్రమే పలుకుతామని ప్రేమికుడు చెబుతుండగా.. నిన్ను తాకే అవకాశం ఏ అమ్మాయికి ఇవ్వనని, మదర్ థెరెసాతో తప్ప ఎవరితో మాట్లాడనివ్వనని ప్రియురాలు అంటుంది. నువ్వు వెళ్ళే దారిలో ఎవరూ లేకుండా చూసుకుంటానని ప్రేమికుడు అంటుంటే.. కనీసం షోరూముల్లో స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను అని ప్రియురాలు చెబుతోంది.

 

 

 

[Telephone Dhwani La Song Lyrics Telugu, Telephone Dhwani La Song Meaning, Bharateeyudu Movie Songs, AR Rahman Telugu Songs, Kamal Haasan, Manisha Koirala, Director Shankar, Telugu Love Songs]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com