Home

»

Exclusive Movie News

రూపాన్ని చూసి మనిషిని తక్కువంచనా వేయకూడదు.!

Aug 25, 2026 3:24PM

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు వచ్చినప్పటికీ, కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులలో తరాల పాటు నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన 'సింహరాశి' ఒకటి. వి. సముద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2001 లో విడుదలైనప్పుడు కేవలం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 

ఈ చిత్రంలో హీరో రాజశేఖర్ ప్రదర్శించిన నటన, ఆయన చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా మనుషులను వారి బాహ్య రూపాన్ని బట్టి, వారు చేసే పనులను బట్టి తక్కువగా అంచనా వేసే అహంకార పూరిత సమాజానికి ఈ సన్నివేశం ఒక చెంపపెట్టు లాంటిది.

'సింహరాశి' చిత్రంలో ఊరి పెద్దగా, అందరి శ్రేయస్సు కోరే ఒక ఆదర్శవంతమైన నరసింహరాజు పాత్రలో రాజశేఖర్‌ నటించారు. ఎంతో డబ్బు, హోదా ఉన్నా.. కాలేజ్, హాస్పిటల్ కట్టించినా రాజు సింపుల్ గా ఉంటాడు. చిన్న గుడిసెలో సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు.

మొదట్లో రాజు అవతారం చూసి, హీరోయిన్ అవమానిస్తుంది. ఇతను చెప్తే తనకు కాలేజ్ లో సీట్ రావడం ఏంటని అవమానకరంగా మాట్లాడుతుంది. తీరా ఆ కాలేజే రాజుది అని తెలిసి షాకవుతుంది. ఆ తర్వాత రాజు గొప్పతనం తెలుసుకొని, అతనిని ఆరాధించడం మొదలుపెడుతుంది.

రాజశేఖర్ తనదైన సహజ నటనతో ఈ సన్నివేశానికి ప్రాణం పోశారు. రూపాన్ని చూసి మనుషులను తక్కువ అంచనా వేయకూడదని, ఇతరులను చిన్నచూపు చూసే మనస్తత్వం మారాలని ఈ సీన్ ద్వారా దర్శకుడు వి. సముద్ర ఎంతో గొప్పగా ఆవిష్కరించారు.

 

 

 

Simharasi, Heart Touching Scene, Rajasekhar, Sakshi Shivanand

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com