
తెలుగు సినిమా చరిత్రలో పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీకి, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలకు సాయికుమార్ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ మార్క్ సృష్టించారు. 'వీడేరా పోలీస్' చిత్రంలో స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరసింహగా ఆయన నటించిన సీన్లు ప్రేక్షకులను నేటికీ మెస్మరైజ్ చేస్తుంటాయి. ముఖ్యంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజ్ రాకెట్, దాని వెనుక ఉన్న క్రిమినల్స్ కుట్రలను బట్టబయలు చేసే క్రమంలో నరసింహ నడిపించిన మైండ్ గేమ్ ప్రతీ ఒక్కరిలో ఆలోచనలు రేకెత్తిస్తుంది.
ఈ కథాంశంలో క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన ముద్దాయి అయిన వీరబ్రహ్మం అనే క్రిమినల్ చుట్టూ కథ తిరుగుతుంది. దాదాపు 2 ఏళ్ల క్రితం ఒక దొమ్మి కేసులో లాయర్ పోతినాయుడు వాదనల కారణంగా సరైన ఆధారాలు లేక వీరబ్రహ్మం కోర్టు ద్వారా నిర్దోషిగా విడుదలవుతాడు. అయితే, క్వశ్చన్ పేపర్ లీకేజ్ రాకెట్ వెనుక అసలు సూత్రధారులు ఎవరు, ఆ పేపర్లు ఎంతమందికి ఎంత మొత్తం రేటుకు అమ్మారు అనే నిజాలను బయటపెట్టేందుకు స్పెషల్ కమిషనర్ నరసింహ రంగంలోకి దిగుతారు. క్రిమినల్స్, లాయర్లు కలిసి ఆడే మైండ్ గేమ్‌కు ప్రతిగా నరసింహ వేసిన పక్కా ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుంది.
వీరబ్రహ్మంను అరెస్ట్ చేసి, నడిరోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాడు. అంతేకాదు క్వశ్చన్ పేపర్ లీకేజ్ వెనుక ఎవరెవరో ఉన్నారో మొత్తం స్టేట్ మెంట్ రాయమని చెప్పి.. పేపర్, పెన్ను ఇచ్చి నరసింహ బయటకు వెళ్తాడు.
అదే సమయంలో పోలీస్ కమిషనర్ స్టేషన్ కి వచ్చి, వీరబ్రహ్మంను లాకప్ డెత్ చేయాలని చూస్తాడు. కానీ, ఇదంతా నరసింహ ట్రాప్ అని ఆ కమిషనర్ లేట్ గా తెలుసుకుంటాడు. లాకప్ డెత్ అంటూ వార్నింగ్ ఇచ్చే కమిషనర్ మాటలను టేప్ రికార్డర్ లో రికార్డు చేస్తాడు నరసింహ. అయినప్పటికీ తనను ఏం చేయలేవు అని కమిషనర్ విర్రవీగుతుండగా.. నరసింహ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి.
సమాజంలో ఒక వ్యక్తిని హత్య చేస్తే అది ఒకరి ప్రాణంతో ముగుస్తుందని, కానీ వేలాది మంది విద్యార్థుల కష్టాన్ని, భవిష్యత్తును నాశనం చేసే ప్రశ్నాపత్రాల లీకేజ్ నేరం అనేది వేలాది ఆత్మల వినాశనంతో సమానమని నరసింహ ఉద్వేగభరితంగా హెచ్చరిస్తారు.
రాత్రింబవళ్లు కష్టపడి చదివి, ఫస్ట్ క్లాస్ ర్యాంకులు సాధించాలని కలలు కనే పేద విద్యార్థుల కష్టాన్ని దొంగలించి, ఆ విద్యా వ్యవస్థనే హత్య చేయడం దారుణమైన నేరమని ఆయన నిలదీస్తారు. ఒక హత్య చేసిన వాడికి ఉరిశిక్ష విధించినప్పుడు, సమాజ పునాదులైన పసిపాపల ఆలోచనలను, నమ్మకాన్ని హతమార్చే క్వశ్చన్ పేపర్ లీకేజ్ క్రిమినల్స్‌ను ఎన్నిసార్లు ఉరితీసినా తక్కువేనని ఘాటుగా సమాధానమిస్తారు. ఈ పేపర్ లీకేజ్ వెనుక ఎంతటి పెద్ద తలకాయలు ఉన్నా వారిని వదిలెట్టనని నరసింహ ఇచ్చే వార్నింగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
ఆ రోజుల్లో వచ్చిన ఈ సినిమా నేటి సమాజానికి కూడా సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే లీకేజీ మూకలకు సాయికుమార్ చెప్పిన ప్రతీ మాట ఒక తూటాలా తగులుతుంది. అందుకే ఈ సీన్ క్లిప్స్ ఇప్పటికీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వ్యూస్ రాబడుతున్నాయి.
Veedera Police, Powerful Scene, Question Paper Leak, Sai Kumar






