
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' (Dragon). ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక క్రేజీ అప్డేట్ హల్ చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమా కథ, ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ పై టాలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.
సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ లో ప్రతి ఒక్క క్యారెక్టర్ విలనిష్ షేడ్స్ లోనే కనిపించింది. ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ పాత్ర కూడా ఎంతో రూడ్ గా, ఒక జపాన్ పిస్టల్ పేరు(Luger)తో పవర్ ఫుల్ మాఫియా డాన్ లా ప్రొజెక్ట్ చేయబడింది. సినిమాలో అందరూ విలన్స్ అయితే మరి హీరో ఎవరు అనే కన్ఫ్యూజన్ అప్పట్లోనే క్రియేట్ అయ్యింది. అయితే ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ వెనుక ఒక భారీ దేశభక్తి కోణం దాగి ఉందనే సరికొత్త విశ్లేషణ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ విషయంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా హింట్ ఇవ్వడం విశేషం.
ప్రస్తుతం వినిపిస్తున్న విశ్లేషణల ప్రకారం, ఇందులో ఎన్టీఆర్ కేవలం ఒకే పాత్రలో రెండు వేర్వేరు షేడ్స్ చూపిస్తారా, లేక అసలు సిసలైన డ్యూయల్ రోల్ లో అలరిస్తారా అనేది మిస్టరీగా మారింది. 'పోకిరి' తరహాలో దేశం కోసం పనిచేసే ఒక అండర్ కవర్ కాప్ మాఫియా డాన్ గా అవతారమెత్తారా? లేదా ఒకే పాత్ర అనే భ్రమ కల్పిస్తూ స్క్రీన్ పై ఇద్దరు ఎన్టీఆర్ లు కనిపిస్తారా అనే సరికొత్త నరేటివ్ పై ప్రశాంత్ నీల్ కసరత్తు చేస్తున్నట్లు టాక్.
ఈ కథకు ఈశాన్య రాష్ట్రాల నేపథ్యంలో, దేశ సమగ్రతను కాపాడే ఒక భారీ మిలిటరీ ఆపరేషన్ తో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. గోల్డెన్ ట్రయాంగిల్ చుట్టూ తిరిగే ఈ మాఫియా సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి హీరో చేసే పోరాటంలో దేశభక్తి ఎలిమెంట్స్ ను ప్రశాంత్ నీల్ చాలా అద్భుతంగా మిక్స్ చేస్తున్నారట. రొటీన్ కి భిన్నంగా రా అండ్ రస్టిక్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ గా దేశభక్తిని జోడించి థియేటర్లను షేక్ చేయాలని చూస్తున్నారు.
మరోవైపు ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' కూడా పక్కా దేశభక్తి నేపథ్యం ఉన్న సినిమానే కావడం విశేషం. అయితే 'ఫౌజీ' ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీ అయితే, 'డ్రాగన్' మాత్రం టోటల్ గా డిఫరెంట్ ప్యాకేజీతో రాబోతోంది. ఆడియన్స్ ని థియేటర్లలో ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి దేశభక్తి అనేది ఒక అద్భుతమైన అస్త్రం. గతంలో బొబ్బిలిపులి, మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలు ఈ ఫార్ములాతోనే రికార్డు వసూళ్లు సాధించాయి.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ రెండు భారీ చిత్రాలలోనూ దేశభక్తి కామన్ పాయింట్ అయినప్పటికీ, ప్రశాంత్ నీల్ తన మార్క్ యాక్షన్ అండ్ ఎలివేషన్స్ తో 'డ్రాగన్' ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. గ్లింప్స్ సృష్టించిన ఇంపాక్ట్ తో ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా రూపాంతరం చెందుతుందో చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.





