Home

»

Exclusive Movie News

Peddi: బాక్స్ ఆఫీస్ వద్ద 'పెద్ది' ఊచకోత.. బాలీవుడ్‌పై నిత్యా మీనన్ ఫైర్!

Jun 8, 2026 3:15PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్ లో వచ్చిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ అధికారికంగా కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేశారు. మేకర్స్ తెలిపిన ప్రకారం ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.292 కోట్ల గ్రాస్ రాబట్టింది. 

ఇలా ఒకవైపు కలెక్షన్ల పరంగా సినిమా దూసుకుపోతుంటే, మరోవైపు ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర రూపకల్పనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' క్యారెక్టర్‌ను కేవలం గ్లామర్ కోసమే పరిమితం చేశారనే విమర్శలు వచ్చాయి. కథలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, కొన్ని సీన్లు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆడియన్స్ మరియు రివ్యూవర్స్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై నెట్టింట వచ్చిన నెగటివ్ రివ్యూలను హీరోయిన్ జాన్వి కపూర్ స్వయంగా లైక్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆడియన్స్ నుంచి వచ్చిన ఈ తీవ్ర స్పందనను గమనించిన దర్శకుడు బుచ్చిబాబు వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా, ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్న కొన్ని వివాదాస్పద సన్నివేశాలను ట్రిమ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి తన హుందాతనాన్ని చాటుకున్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సారీ చెప్పి సీన్స్ కట్ చేసినప్పటికీ, ఈ విషయంపై బాలీవుడ్ మీడియా మరియు అక్కడి సినీ వర్గాలు సౌత్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం ప్రారంభించాయి. టాలీవుడ్ మరియు సౌత్ సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తారని, హీరోయిన్ పాత్రలను కేవలం కూరలో కరివేపాకు లాగా వాడుకుంటారంటూ బాలీవుడ్ సర్కిల్స్ నుంచి ఎటాక్ మొదలైంది. 

ఈ నేపథ్యంలో టాలెంటెడ్ నటి నిత్యా మీనన్ (Nithya Menen) రంగంలోకి దిగి బాలీవుడ్ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ సమస్యను కేవలం సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేసి మాట్లాడటం ముమ్మాటికీ తప్పు అని ఆమె మండిపడింది. ఒక సినిమాను మాత్రమే కేంద్రంగా చేసుకుని ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేయడం సరికాదని, సమాజంలో మహిళలను ఎలా చూస్తున్నారో, సినిమాలో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుందని స్పష్టం చేసింది.

బాలీవుడ్‌ను కడిగిపారేస్తూ నిత్యా మీనన్ ఒక సంచలన ప్రకటన చేసింది. కేవలం సౌత్ సినిమాల్లోనే కాదు, బాలీవుడ్‌లో కూడా మహిళా పాత్రలను కరివేపాకు లాగా వాడిన 100 ఉదాహరణలు తాను చూపించగలనని సవాల్ విసిరింది. ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు, అంతర్జాతీయ స్థాయిలో సినిమా పరిశ్రమలో ఉన్న ఒక పెద్ద జాడ్యమని ఆమె విశ్లేషించింది. 

ఇదంతా ఒక ఎత్తైతే, నిత్యా మీనన్ ఈ వివాదంలో హీరోయిన్ జాన్వి కపూర్ ప్రవర్తనను కూడా గట్టిగా ప్రశ్నించింది. సినిమా విడుదలయ్యాక నెగటివ్ రివ్యూలకు లైకులు కొట్టడం కాదు, షూటింగ్ సెట్‌లోనే కాస్ట్యూమ్స్ వేసుకుని డైలాగ్స్ చెబుతున్నప్పుడే ఆ క్యారెక్టరైజేషన్ ఏంటో అర్థమవుతుంది కదా అని నిలదీసింది. పాత్ర నచ్చనప్పుడు, మహిళల వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేలా ఉన్నప్పుడు సెట్ లోనే దర్శకుడితో కూర్చుని 'నో' అని చెప్పే ధైర్యం ఎందుకు చేయలేదని జాన్వి కపూర్‌ ని ప్రశ్నించింది. గతంలో ఎంతోమంది హీరోయిన్లు కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా ప్రాజెక్టుల నుండి తప్పుకున్నారని గుర్తుచేస్తూ, షూటింగ్ సమయంలో మౌనంగా ఉండి ఇప్పుడు సానుభూతి కోసం ప్రయత్నించడం కరెక్ట్ కాదంటూ నిత్యా మీనన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com