Home

»

tmdbexclusive

తాగిన మైకంలో అలివేలు అనుకుని ఎంఎస్ నారాయణ చేసిన హంగామా చూశారా?

May 07, 2026

టాలీవుడ్ కామెడీ అనగానే మనకు గుర్తొచ్చే అతికొద్ది మంది హాస్య నటుల్లో ఎంఎస్ నారాయణ ఒకరు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, డైలాగ్ చెప్పకముందే ముఖంలో ఒక చిరునవ్వు వచ్చేస్తుంది. ముఖ్యంగా ఆయన 'మందు బాబు' పాత్రలు పోషించడంలో ఒక ప్రత్యేకమైన మేనరిజాన్ని సృష్టించుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన 'అందగాడు' సినిమాలోని ఎంఎస్ నారాయణ కామెడీ సీన్స్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలో ఎంఎస్ నారాయణ స‌త్యం అనే పాత్రలో కనిపిస్తారు. తాగి మైకంలో తన భార్య అలివేలు అనుకుని పరాయి స్త్రీలను పట్టుకోవడం, ఆ తర్వాత వారు ఇచ్చే షాకులతో నీరసించిపోవడం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఒక సీన్‌లో సాక్షాత్తూ లేడీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌నే తన భార్య అనుకుని ఆటపట్టించి, చివరకు స్టేషన్‌లో 'వాయింపు' వాయించుకోవడం హైలైట్ అని చెప్పాలి. 

కేవలం తాగిన వేషాలే కాకుండా, దెయ్యాల గురించి ఆయన చెప్పే లాజిక్కులు, నీటిని వృధా చేయకూడదని మందులో నీళ్లు కలపకుండా తాగమని ఇచ్చే సలహాలు ఎంఎస్ నారాయణ మార్కు హాస్యాన్ని గుర్తుచేస్తాయి. "మొగుడికి మూడ్ వచ్చినప్పుడు కోపరేట్ చేయాలి" అంటూ ఆయన చెప్పే డైలాగులు, టైమింగ్ అద్భుతం. రాజేంద్ర ప్ర‌సాద్‌తో ఆయన చేసే కామెడీ ట్రాక్ ఈ సినిమాకే పెద్ద ఎసెట్.

ఈ వీడియో చూసిన నెటిజన్లు "ఎంఎస్ నారాయణ గారిని మించిన హాస్య నటుడు లేరు" అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత బిజీ లైఫ్‌లో కాసేపు మనస్ఫూర్తిగా నవ్వుకోవాలనుకునే వారికి ఈ కామెడీ సీన్స్ ఒక మంచి విందు అని చెప్పొచ్చు. పాత సినిమాల్లోని ఇటువంటి ఆణిముత్యాల్లాంటి కామెడీ సీన్స్‌ను మళ్ళీ చూస్తుంటే ఆ రోజులే వేరనిపిస్తుంది. ఇలాంటి ఫ‌న్నీ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com