
తెలుగులో వింటేజ్ కామెడీ సన్నివేశాలకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దశాబ్దాలు గడుస్తున్నా పాత సినిమాల్లోని హాస్య సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యూనిక్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే సీనియర్ నటులు ఉంటే ఆ సన్నివేశాల రేంజ్ వేరేలా ఉంటుంది.
'లీలామహల్ సెంటర్' సినిమాలోని కామెడీ సీన్స్ ఇప్పటికీ ప్రతి ఒక్కరినీ ఎంతగానో అలరిస్తున్నాయి. కృష్ణభగవాన్ తనదైన మార్క్ వన్-లైనర్లతో విజృంభిస్తే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన గెటప్స్ తో, రఘుబాబు తన విలక్షణమైన మేనరిజంతో అందించిన కామెడీ రచ్చ అంతా ఇంతా కాదు.
థియేటర్లో అమ్మోరు సినిమా ఆడుతుండటంతో.. ఆ ప్రాంతంలో అమ్మోరు విగ్రహం పెట్టి, దానిని గుడిలా మార్చేస్తారు. ఈ క్రమంలో ప్రేక్షకులపై కృష్ణభగవాన్ వేసే సెటైర్లు నవ్వులు పూయిస్తాయి. ఆ సమయంలో
ముఖ్యంగా పెళ్లి కాని ఒక యువతికి "పండంటి బిడ్డ పుడతాడు" అని దీవించడం, దానికి ఆ అమ్మాయి "నాకింకా పెళ్లే కాలేదు" అని ఆశ్చర్యపోతే.. వెంటనే కృష్ణభగవాన్ "బిడ్డ పుట్టాక ఇంకా పెళ్లి ఎందుకు?" అంటూ ఇచ్చే కౌంటర్ ఈ క్లిప్‌కే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆ సమయంలో "అమ్మోరికి బొట్టు పెట్టమ్మా" అంటూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పే డైలాగ్ కూడా హైలైట్ గా ఉంటుంది.
మరోవైపు రఘుబాబు గుండు కొట్టే పాత్రలో కనిపించి నవ్వుల విందు పంచారు. ఒక పిల్లాడికి గుండు చేయమంటే మొత్తం గాట్లు పెడతాడు. దాంతో గుండు మొత్తం రక్తంతో నిండిపోతుంది. మరోవైపు కుక్క అరుస్తుండటంతో "గుండు చేస్తున్నప్పుడు ఒక్క ముక్కయినా కింద పడకపోతుందా అని దాని ఆశ" అంటాడు. ఆ దెబ్బకి గుండు చేయించుకోవాలి అనుకున్నవాళ్ళు జంప్ అవ్వడం ఫన్నీగా ఉంటుంది.
ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఈ మ్యాజికల్ కామెడీ సీన్‌ను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఒత్తిడిని మర్చిపోయి హాయిగా నవ్వుకోవడానికి ఇలాంటి వింటేజ్ కామెడీ క్లిప్స్ అద్భుతమైన ఛాయిస్ అని చెప్పవచ్చు.
Leela Mahal Center, Comedy Scenes, Krishna Bhagavan, Dharmavarapu Subramanyam





