Home

»

Exclusive Movie News

దయచేసి ఇంకెప్పుడు అడుక్కోకు నాన్న.. అక్కా,చెల్లెళ్ళ అసలు కథ ఏంటి!

Jun 30, 2026 3:45PM

 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కుటుంబ విలువలు, భావోద్వేగాల నేపథ్యంతో వచ్చిన చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా దర్శకుడు వంశీ అద్భుతమైన ప్రతిభతో, ముళ్లపూడి వెంకటరమణ కథతో 1987 మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'లాయర్ సుహాసిని'. సుహాసిని, భాను చందర్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన క్యారెక్టర్స్ పోషించిన ఈ లీగల్ ఫ్యామిలీ డ్రామా నాటి తరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక బాధ్యతారహితమైన, తాగుబోతు తండ్రి ఉన్న పేద కుటుంబంలో జన్మించిన సుహాసిని జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి, కష్టపడి సంపాదించే పెద్దక్క సంగీత తన చెల్లెలిని చదివించడానికి ఎన్నో త్యాగాలు చేస్తుంది. అక్క పడుతున్న కష్టాన్ని చూసి, కుటుంబ ఆర్థిక ఇబ్బందులను తీర్చడం కోసం, ఏకంగా 10,000 రూపాయల డబ్బు వస్తుందనే ఆశతో తనకంటే వయసులో చాలా పెద్దవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కూడా సుహాసిని సిద్ధపడుతుంది.

అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో లాయర్ శంకర్ (భాను చందర్) సుహాసిని జీవితంలోకి ప్రవేశిస్తాడు. సుహాసిని ఆత్మగౌరవాన్ని, పట్టుదలను మెచ్చుకున్న శంకర్, నాటకీయ పరిణామాల మధ్య ఆమెను వివాహం చేసుకుంటాడు. అయితే శంకర్ తల్లి లక్ష్మి విపరీతమైన డబ్బు పిచ్చి ఉన్న స్త్రీ. భారీ కట్నం వస్తుందని ఆశించిన ఆమెకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే కోడలిని అడుగడుగునా వేధించడం మొదలుపెడుతుంది. మామగారు ప్రభాకర్ రెడ్డి సుహాసిని మంచి స్వభావాన్ని ఇష్టపడినప్పటికీ, అత్తగారు మాత్రం ఎలాగైనా కొడుకు, కోడలి మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంది. ఈ క్రమంలోనే సుహాసిని ఢిల్లీ వెళ్లినప్పుడు వారి మధ్య తీవ్రమైన మనస్పర్థలు తలెత్తుతాయి. ఈ దంపతులకు ఒక బాబు కూడా జన్మిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ పెద్దక్క సంగీత మరణించిన తర్వాత, అనాథలుగా మిగిలిన తన తోబుట్టువులను ఆదుకోవడానికి వెళ్తున్న సుహాసినిని అత్తగారు తీవ్రంగా అడ్డుకుంటుంది.

మరి మూవీలో ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో విధవరాలైన  సావిత్రి (సంగీత) డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడుతుంటుంది. పిల్లలకి తిండి పెట్టడానికీ కూడా డబ్బులు ఉండవు. అలాంటిది తను బయటనుంచి వచ్చే సరికి మతిస్థిమితం లేని తన తండ్రి బయట అడుక్కొచ్చిన అన్నాన్ని మనవడు, మానవరాళ్లకి  తినిపిస్తుంటాడు. ఆ బాధని తలుచుకొని సావిత్రి గుండెలదిరిపోయేలా ఏడుస్తుంది. ఇంకెప్పుడు అడుక్కోవద్దు నాన్న అని చెప్పికొచ్చిన సావిత్రి చివరకి తన తండ్రిని దేవుడు అని తను కూడా తండ్రి చేతులతో ఒక అన్నం తింటుంది. ఈ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు రావడం ఖాయంతో పాటు పగోడికి కూడా అలాంటి బాధ రావద్దని అనిపిస్తుంది.

ఆలాగే తన అక్క సావిత్రికి యాక్సిడెంట్ అవ్వడంతో  సుహాసిని చూసి ఒక ప్రవైట్  హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. దీంతో సుహాసిని అత్త వచ్చి ఎందుకు మీ అక్కయ్యకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రవైట్ హాస్పిటల్ కి తీసుకొచ్చావని కోప్పడుతుంటుంది. ఈ లోపు సంగీతకి స్పృహ వచ్చి సుహాసినిని తిట్టి సుహాసిని అత్తని క్షమాపణ కోరుతుంది. తను ఎందుకు క్షమాపణ కోరింది? అక్క చెల్లెల్లు ఎందుకు ఆ విధంగా ఉన్నారు? సావిత్రి కథ ఏంటి? అని తెలుసుకోవాలని ఉంది కదా? అయితే  తెలుగు వన్ లో ఉన్న ఈ వీడియో మీరు చూస్తే అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి.ఎందుకంటే మూవీ మొత్తాన్ని చూడటం గ్యారంటీ. దాంతో మీకు  మనిషి ముఖం వెనక దాగి ఉన్న నిజమైన ముఖం తెలుస్తుంది. 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com